శుక్రవారం 30 అక్టోబర్ 2020
Jayashankar - Sep 25, 2020 , 06:30:36

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ భూసేకరణ త్వరగా పూర్తి చేయండి

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ భూసేకరణ త్వరగా పూర్తి చేయండి

  • కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌

భూపాలపల్లి కలెక్టరేట్‌ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన రెవెన్యూ, మెప్మా, బ్యాంకు అధికారులు, ఇండియన్‌  రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యులు, సంబంధిత అధికారులతో వివిధ అంశాలపై సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కాళేశ్వరం, చిన్న  కాళేశ్వరం ప్రాజెక్ట్‌ల భూ సేకరణ త్వరగా పూర్తి చేసి బాధిత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఇన్‌చార్జి ఆర్డీవో వైవీ గణేశ్‌ను ఆదేశించారు.

పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు వేగవంతం చేసి వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి ఆన్‌లైన్‌లో పంపించాలన్నారు. జిల్లా కేం ద్రంలో అన్ని సౌకర్యాలతో కూడిన ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ భవనాన్ని నిర్మించేందుకు చర్య లు తీసుకోవాలని టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ డీఈ అనితను ఆదేశించారు. రూర్బన్‌ మిషన్‌ కార్యక్రమంలో భాగంగా నాగారం క్లస్టర్‌లో స్వయం సహాయక మహిళా సంఘాల ఆధ్వర్యంలో పాలశీతలీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అన్నా రు. లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న భూపాలపల్లి పట్టణంలోని వీధి వ్యాపారులను ఆదుకునేందుకు చేపట్టిన స్ట్రీట్‌ వెండర్స్‌ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్‌, మెప్మా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశాల్లో జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్‌ బాలకృష్ణ, ఎల్డీఎం శ్రీనివాస్‌, రూర్బన్‌ మిషన్‌ జిల్లా ప్రాజెక్ట్‌ అధికారి సింధూర, మెప్మా అధికారి రాజేశ్వరి, పంచాయతీ రాజ్‌ ఈఈ రాంబాబు, డీఈలు, ఏఈలు, ఇండియన్‌  రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.