గురువారం 29 అక్టోబర్ 2020
Jayashankar - Sep 25, 2020 , 06:30:21

‘పల్లె పార్కు’ రెడీ

‘పల్లె పార్కు’ రెడీ

  • వివిధ రకాల  పూల మొక్కలతో కనువిందు
  • గ్రామస్తుల్లో ఆనందం

ఆత్మకూరు, సెప్టెంబర్‌ 24 : గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అందంగా తీర్చి ది ద్దేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నది. పల్లెల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఈనేపథ్యంలో మండలంలోని లింగమడుగుపల్లి గ్రామంలో ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిలో సర్పంచ్‌ జిల్లె ల రాజేశ్వరి, పంచాయతీ కార్యదర్శి లావణ్య రెం డు నెలలుగా పల్లె ప్రకృతి వనం ఏర్పాటుపై దృష్టి సారించారు. పార్కులో రకరకాల పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలు నాటారు. ప్రధాన రహదారికి ఆనుకుని ఉండడంతో పార్కు అందాలు చూ పరులకు కనువిందు చేస్తున్నాయి. కొంతమంది కొద్ది సేపు పార్కులో ఏర్పాటు చేసిన బెంచీలపై కూర్చొని సేదతీరడం కనిపిస్తున్నది. గ్రామంలోని పలువురు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పార్కుకు బెంచీలను బహూకరించారు. కాగా, పార్కుతో గ్రామానికి కొత్తందం వచ్చిందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.logo