మంగళవారం 27 అక్టోబర్ 2020
Jayashankar - Sep 24, 2020 , 05:41:23

రైతు కళ్లలో ఆనందమే లక్ష్యం

రైతు కళ్లలో ఆనందమే లక్ష్యం

  • బూజుపట్టిన చట్టాలను దులుపుతున్నసీఎం
  • ప్రజారంజక పాలన సాగిస్తున్న కేసీఆర్‌
  • అదానీ, అంబానీల కోసమే మోడీ కొత్త చట్టాలు
  • మండిపడ్డ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి టౌన్‌ : రైతన్న కళ్లలో ఆనందం చూసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త రెవె న్యూ చట్టం తీసుకొచ్చారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం నూతన చట్టానికి మద్దతుగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీశారు. వరంగల్‌ రూరల్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్‌ చై ర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్‌ సాంబారి సమ్మారావుతో కలిసి ఎమ్మెల్యే ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గండ్ర దంపతులు భూపాలపల్లి నుంచి గాంధీనగర్‌ వరకు సుమారు 15 కిలోమీటర్లు స్వయంగా ట్రాక్టర్‌ నడిపారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ, ఉద్యమం ద్వారా తెలంగాణ రా ష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్‌.. రాష్ర్టాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. అనతి కాలంలోనే రాష్ర్టాన్ని దేశంలోనే ముందంజలో నిలిపారని అన్నారు. 24గంటల ఉచిత వి ద్యుత్‌, రైతుబంధు, రైతు బీమా లాంటి అనేక ప థకాలు మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. 

అలాగే బూజుపట్టిన చట్టాలను దులిపి ప్రజలకు ఉపయోగపడేలా కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చారని వివరించారు. ఈ చట్టం ప్రజలకు, రైతులకు ఎంతో మేలు చేస్తుందని చెప్పా రు. ఇలా సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందిస్తుంటే.. మోదీ సర్కారు మాత్రం అదానీ, అంబానీలకు మేలుచేసే కొత్త చట్టాలు తీసుకొస్తున్నదంటూ మండిపడ్డారు. సంఖ్యా బలం ఉందని విద్యుత్‌ సవరణ బిల్లు, నూతన వ్యవసాయ చట్టం తెచ్చి పేదలు, రైతుల నడ్డివిరిచేలా వ్యవహరిస్తున్నారన్నారు. జీఎస్టీ తీసుకువచ్చినా రాష్ర్టాలు స్వాగతించాయని, చివరికి జీఎస్టీ వాటా ను రాష్ర్టాలకు అందించకుండా అప్పులు తెచ్చుకోవాలని మొండిచేయి చూపారని అన్నారు.

రైతులు సంతోషంగా ఉన్నారు..

సీఎం కేసీఆర్‌ తనదైన రీతిలో పాలన సాగిస్తూ రాష్ర్టాన్ని దేశంలోనే ముందంజలో నిలిపారు. ఆరేళ్లలో అద్భుతాలు చేసి చూపించి దేశాన్ని తెలంగాణ వైపు చూసేలా చేశారు. కొత్త రెవెన్యూ చట్టంతో రైతులు సంతోషంగా ఉన్నారు. కరోనా ఉన్నా రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు వేశారు. మోడీ కొత్త చట్టాలు పేదలు, రైతుల నడ్డివిరిచేలా ఉన్నాయి. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో కేంద్రంపై పోరాటాలకు సిద్ధంగా ఉండాలి. త్వరలో ప్రారంభోత్సవాలు, అభివృద్ధి పనుల శంకుస్థాపనలకు సీఎం కేసీఆర్‌ భూపాలపల్లికి వస్తారు.
- గండ్ర జ్యోతి, వరంగల్‌ రూరల్‌ జడ్పీ చైర్‌పర్సన్‌

వ్యవసాయాన్ని పండుగ చేశారు..
గత పాలకులు వ్యవసాయం దండగ అంటే సీఎం కేసీఆర్‌ పండుగ చేసి చూపించారు. అవినీతి కూపంలా మారిన రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ కొత్త రెవెన్యూ చట్టం తేవడం గొప్ప విషయం. రిజిస్ర్టేషన్‌, మ్యుటేషన్‌ను ఒకే చోట చేర్చి రైతులకు, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. సీఎం కేసీఆర్‌ పాలనకు పూర్తి విరుద్ధంగా ప్రధాని మోదీ పాలన సాగుతోంది. ప్రజావ్యతిరేక చట్టాలను తన సంఖ్యాబలంతో తీసుకొస్తున్న బీజేపీ వైఖరిని ఎండగట్టాలి.
- డాక్టర్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌


logo