సోమవారం 19 అక్టోబర్ 2020
Jayashankar - Sep 23, 2020 , 03:19:08

పల్లెప్రకృతి వనాలతో ఆహ్లాద వాతావరణం

పల్లెప్రకృతి వనాలతో ఆహ్లాద వాతావరణం

చిట్యాల/కాటారం / మహదేవపూర్‌, సెప్టెంబర్‌ 22 : పల్లె ప్రకృతి వనాలతో గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతవరణం నెలకొంటుందని ఎంపీడీవో రవీంద్రనాథ్‌ అన్నారు. మండలంలోని ఒడితల, నైన్‌పాక గ్రామాల్లో నిర్మిస్తున్న పల్లె ప్రకృతి పనులను గిద్దెముత్తారం, కాల్వపల్లి గ్రామాల్లో పల్లె ప్రకృతి వనానికి స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీవో శంకర్‌రావు, ఏపీవో అలీంపాషా, సర్పంచులు సాంబలక్ష్మి, పోశాలు పాల్గొన్నారు. కాటారం మండలంలోని పలు గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు సర్పంచ్‌లతో కలిసి ఎంపీపీ పంతకాని సమ్మయ్య, తహసీల్దార్‌ సునీత, ఎంపీడీవో శంకర్‌ స్థలాలను పరిశీలించారు. కాటారం, గారెపల్లి, వీరాపూర్‌, చిదినెపల్లి గ్రామాల్లోని భూములను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ తోట జనార్దన్‌, ఆర్‌ఐ భాస్కర్‌, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. మహదేవపూర్‌లో ఫారెస్ట్‌ రేంజర్‌ కమల, సర్పంచ్‌ శ్రీపతిబాపు సంయుక్తంగా సర్వే నిర్వహించి ప్రకృతి వనం ఏర్పాటుకు హద్దులు నిర్ణయించారు. కార్యక్రమంలో మండల స్పెషల్‌ ఆఫీసర్‌ రాజేందర్‌రెడ్డి, గ్రామ కార్యదర్శి రవీందర్‌, ఉపాధి హామీ సిబ్బంది మధు పాల్గొన్నారు.


logo