శనివారం 24 అక్టోబర్ 2020
Jayashankar - Sep 23, 2020 , 03:19:12

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లతో మహిళలకు ఉపాధి

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లతో మహిళలకు ఉపాధి

ఏటూరునాగారం, సెప్టెంబర్‌ 22 : జిల్లాలో మహిళా సంఘాల ద్వారా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక తయారు చేయాలని జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, ఐటీడీఏ పీవో హన్మంత్‌ కొండిబా సూచించారు. ఐటీడీఏ కార్యాల యంలో మంగళవారం జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన అధికారులతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటుపై వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా డిమాండ్‌ ఉన్న యూనిట్లను ఎంపిక చేసి మహిళకు ఉపాధి కల్పించాలన్నారు. తెలంగాణ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ సీఈవో సుష్మ, సెర్ప్‌ సీఈవో రజిత మాట్లాడుతూ.. మిర్చి, వ్యవసాయ ఉత్పత్తులు, కోళ్లు, చేపలపరిశ్రమలు, డెయిరీ యూనిట్ల నిర్వహణపై వివరించారు. నెల రోజుల్లో  వీటిపై ప్రణాళికలు అందజేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి గౌస్‌హైదర్‌, పీహెచ్‌వో సంజీవరావు, ఐకేపీ ఏపీడీ శ్రీనివాస్‌, పీఏవో లక్ష్మీ ప్రసన్న,  బ్యాంకు మేనేజర్లు, డీఆర్‌డీవో, డీసీవో, డీఎస్‌వో, వివిధ బ్యాంకుల మేనేజర్లు, ఐకేపీ డీపీఎంలు, సీసీలు పాల్గొన్నారు. 

ఐటీడీఏలో ఈ-ఆఫీస్‌  

ఐటీడీఏ పరిధిలోని అన్ని శాఖలను ఈ-ఆఫీస్‌ పరిధిలోకి తీసుకురానున్నట్లు ఐటీడీఏ పీవో హన్మంత్‌ కొండిబా తెలిపారు.  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి న నేపథ్యంలో గిరిజన సంక్షేమ, ఇంజినీరింగ్‌, ఐటీడీఏ, డిప్యూటీ డీఎంహెచ్‌వో, విద్యా విభాగం, డిప్యూ టీ ఈవో, డీటీడబ్ల్యూవో, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌, గిరిజన సహకార సంస,్థ ఐసీడీఎస్‌, విభాగాల ఉన్నతాధికారులతో పీవో సమావేశం నిర్వహించారు. ఆయా విభాగాలకు చెందిన ఉద్యోగుల వివరాలను అప్‌లోడ్‌ చేయడంతో పాటు అన్ని ఫైల్స్‌ ఈ-ఆఫీస్‌ ద్వారా పంపించాలని పీవో సూచించారు. కిందిస్థాయి ఉద్యో గి నుంచి ఉన్నతాధికారి వరకు ఈ విధానాన్ని అలవ ర్చుకోవాలన్నారు. సమావేశంలో ఏపీవో వసంతరావు, ఏవో దామోదర్‌స్వామి, వరంగల్‌ రూరల్‌, అర్బన్‌, ములుగు జిల్లాల డీటీడబ్ల్యూవోలు మంకిడి ఎర్రయ్య, దబ్బకట్ల జనార్దన్‌, పోచం, గురుకులం అర్‌సీవోలు రాజ్యలక్ష్మి, డీఎస్‌. వెంకన్న, ఏటీడీవో దేశీరాంనాయక్‌, సీడీపీవో హేమలత పాల్గొన్నారు. 

ఆదివాసీ చట్టాలను అమలు చేయాలి

ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ చట్టాలు అమలు చేయాలని కోరుతూ తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కబ్బాక శ్రావణ్‌కుమార్‌ ఐటీడీఏ పీవో హన్మంత్‌ కొండిబాకు వినతిపత్రం అందజేశారు. భూ ప్రక్షాళన పేరు తో ఇచ్చిన పట్టాలు రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో తుడుందెబ్బ నాయకులు సోమరాజు, సిద్ధబోయిన సర్వేశ్‌, చిరంజీవి, కాపుల సమ్మయ్య, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo