గురువారం 29 అక్టోబర్ 2020
Jayashankar - Sep 21, 2020 , 06:05:01

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరం

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరం

మల్హర్‌, సెప్టెంబర్‌ 20: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా యావత్‌ తెలంగాణ భూములు సస్యశ్యామలమవుతున్నాయని, తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరమని టీఆర్‌ఎస్‌ నేత జక్కు రాకేశ్‌ అన్నారు. ఆదివారం కొయ్యూరులో గ్రోమోర్‌ ఎరువుల దుకాణాన్ని ఆయన ప్రారంభించారు. 

అనంతరం తాడిచెర్ల గ్రామంలోని బ్రాండ్‌ ఫ్యాక్టరీ బట్టల షాపును ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు లింగమూర్తి, సర్పంచ్‌ సుంకరి సత్తయ్య, మండల యూత్‌ అధ్యక్షుడు జాగరి హరీశ్‌, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ మల్క ప్రకాశ్‌ రావు, టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ మంథని నియోజకవర్గ ఇన్‌చార్జి భూపెల్లి రాజు, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి బూడిద మల్లేశ్‌, మాజీ సర్పంచ్‌ బాద్రపు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.