శుక్రవారం 30 అక్టోబర్ 2020
Jayashankar - Sep 20, 2020 , 06:34:27

గని ప్రమాదంలో కార్మికుడికి గాయాలు

గని ప్రమాదంలో కార్మికుడికి గాయాలు

భూపాలపల్లి : సింగరేణి ఏరియా కేటీకే 1వ భూగర్భగనిలో ప్రమాదం జరి గి గాండ్ల అశోక్‌ ట్రామర్‌ కార్మికుడికి గాయాలయ్యాయి. శుక్రవారం రాత్రి (రెండో షిఫ్ట్‌లో) గనిలో 1వ సీమ్‌  20వ డిస్ట్రిక్ట్‌ , 2వ డిఫ్‌ 31 లెవల్‌లో అశోక్‌  విధులు నిర్వర్తిస్తున్నాడు. బొగ్గు టబ్బులు  అబేసై పైకి వస్తున్న క్రమంలో టబ్బులు లైన్‌ తప్పి అతడి కాలుపై పడి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అశోక్‌ను అధికారులు ఏరియా దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.