ఆదివారం 01 నవంబర్ 2020
Jayashankar - Sep 20, 2020 , 06:30:01

108లో మహిళ ప్రసవం

108లో మహిళ ప్రసవం

కాటారం :  కాటారం సమీపంలో 108 అంబులెన్స్‌లో శనివారం మహిళకు ప్రసవం చేసినట్లు అంబులెన్స్‌ ఈఎంటీ సత్యనారాయణ, పైలెట్‌ ప్రవీణ్‌ తెలిపారు. మహాముత్తారం మండలం బోర్లగూడెం గ్రామానికి చెందిన పెరుమాండ్ల సమ్మక్కకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు కాల్‌ చేశారు. బోర్లగూడెం నుంచి కాటారం పీహెచ్‌సీకి తీసుకెళ్తున్న క్రమంలో పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో కాటారం సమీపంలో మహిళకు ప్రసవం చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డలను కాటారం పీహెచ్‌సీలో చేర్పించినట్లు ఈఎంటీ తెలిపారు.