సోమవారం 26 అక్టోబర్ 2020
Jayashankar - Sep 19, 2020 , 05:43:33

సర్వే షురూ..

సర్వే షురూ..

  •  ‘కాపురం’లో తేలనున్న బినామీల లెక్కలు
  • సగం మంది బయటివారిగా ప్రాథమిక అంచనా
  •  ఫీల్డ్‌ సర్వే జరిపిన తహసీల్దార్‌ శ్రీనివాస్‌

మల్హర్‌, సెప్టెంబర్‌ 18 : మండలంలోని జెన్‌కో ఉపరితల ప్రాజెక్టు నిర్వాసిత గ్రామమైన కాపురంలో నిజానిజాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రికలో ‘కాపురంలో కనికట్టు’ శీర్షికన ప్రచురితమైన కథనంతో రెవెన్యూ అధికారులు శుక్రవారం కాపురం గ్రామ బాటపట్టారు.  గ్రామంలోని వాస్తవ నిర్వాసితులెవరు? బినామీలు ఎవరు? అనే దానిపై క్షేత్ర స్థాయిలో విచారించారు.

కాగా, మొత్తం 58 కుటుంబాలు మాత్రమే కాపురం గ్రామంలో నివాసం ఉంటున్నట్లుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు. అంటే ఈ లెక్కన ప్రభుత్వం నుంచి అప్పనంగా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కాజేయాలని చూసిన బినామీల లెక్కలు కూడా బయటపడుతున్నాయి. తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఐ సరిత, వీఆర్వో కవిత చేసిన సర్వేలో 58 కుటుంబాలు తప్ప మిగతా వారంతా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నవారుగానే నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. కాగా, బినామీలు ఇంకా ఎంత మంది ఉన్నారు? వీరి వెనుక దళారులు ఎవరు? మొత్తం ఈ సినిమా సెట్టింగ్‌లకు సూత్రధారులెవ్వరు? అనేది మరింత లోతుగా విచారణ జరిపితే బయటపడే అవకాశముంది.logo