శుక్రవారం 30 అక్టోబర్ 2020
Jayashankar - Sep 17, 2020 , 02:25:23

‘కాపురం’లో కనికట్టు!?

‘కాపురం’లో కనికట్టు!?

  • ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ  కోసం పుట్టగొడుగుల్లా బినామీలు
  • లేనివి ఉన్నట్లుగా చిత్రీకరణ
  • రూ.కోటి దాకా ప్రభుత్వ సొమ్ము కొల్లగొట్టే ప్రయత్నాలు
  • ఉన్నతాధికారులు కల్పించుకుంటేనే గుట్టు బట్టబయలు 

‘కాపురం’లో కనికట్టు జరుగుతున్నదా..? లేనివి ఉన్నట్లుగా చిత్రీకరిస్తున్నది ఎందుకు..? ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని అప్పనంగా కొట్టేసేందుకేనా..?’ అంటే అవుననే అంటున్నారు వాస్తవ లబ్ధిదారులు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మల్హర్‌ మండలంలో జెన్‌కో బొగ్గు గనుల ప్రభావిత గ్రామమైన ‘కాపురం’లో ఏ ఇద్దరు కలిసినా ఇదే విషయం చర్చించుకుంటున్నారు. అసలు పిల్లలే లేనివారు ఉన్నట్లుగా.. ఇద్దరు కొడుకులుంటే ముగ్గురుగా.. ఊరికి సంబంధమే లేనివారు స్థానికులుగా ధ్రువీకరణ పత్రాలు పొందుతూ సర్కారు సొమ్ము కొట్టేసేందుకు రెడీ అయ్యారు. ఉన్నతాధికారులు కల్పించుకుంటేనే గుట్టు బట్టబయలవుతుందని ఊరివాళ్లే స్పష్టం చేస్తున్నారు.  

- మల్హర్‌ 

 

మల్హర్‌: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మల్హర్‌ మండలంలోని కాపురం, జెన్‌కో ఉపరితల బొగ్గు గని ప్రభావిత గ్రామం. ఈ ఊరులో బొగ్గు తవ్వ కాల కోసం భూములు, ఇండ్లు కోల్పోయిన నిర్వా సితులకు ఇదివరకే నష్టపరిహారం చెల్లించారు. కాగా గ్రామంలో మరికొంతమంది నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని వర్తింపజేసి, నష్ట పరిహా రం చెల్లించి పునరావాసం కల్పించేందుకు అధికా రులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆలస్యం కావ డంతో పెద్దపల్లి జడ్పీ అధ్యక్షుడు పుట్ట మధు సైతం ప్రత్యేక చొరవతో నిర్వాసితులకు సత్వర న్యాయం చేయాలని జెన్‌కో సీఎండీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆర్‌అండ్‌ఆర్‌ (రిహాబిలిటేషన్‌ అండ్‌ రీ సెటిల్‌ మెంట్‌) చెల్లింపుల్లో కదలికలు మొదలయ్యాయి.

ఇక ఈ విషయం తెలుసుకున్న కొంతమంది వ్యక్తు లకు ‘కాపురం’ గ్రామంపై కన్ను పడింది. సంది ట్లో సడేమియాగా ప్రభుత్వం నుంచి అప్పనంగా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద డబ్బులు కాజేసేందు కు రంగంలోకి దిగారు. అసలు పిల్లలు లేనివాళ్లు సైతం తమకు పిల్లలు ఉన్నట్లుగా.. ఇద్దరు కొడు కులు ఉంటే.. మరింత నష్ట పరిహారం కోసం ము గ్గురు ఉన్నట్లుగా కొందరు అధికారులతో కుమ్మక్కై ధ్రువీకరణపత్రాలు పొందినట్లు స్థానికులు చర్చిం చుకుంటున్నారు.

కొందరు అసలు గ్రామంలో నివసించకపోయినా ఇక్కడే ఉన్నట్లు పత్రాలు పొందారని తెలిసింది. పిల్లలకు వయస్సు లేకున్నా పెంచి మరీ తప్పుడు పత్రాలు చిత్రీకరించి ప్యాకేజీ కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఇలా సుమారు 20మందిదాకా బినామీలు పుట్టుకొచ్చారని గ్రామ స్తులే బాహాటంగా చెబుతున్నారు. ఒక్కో నిర్వాసి తుడికి ఆర్‌అండ్‌ప్యాకేజీ కింద సుమారు రూ.7 లక్షల నుంచి రూ.10లక్షల దాకా వస్తుండడంతో ఈ లెక్కన అప్పనంగా సుమారు రూ.కోటి దాకా సర్కారు సొమ్ము కాజేసేందుకు ప్రయత్నాలు చేస్తు న్నట్లు తెలిసింది. ఇక ఉన్నతాధికారులు చొరవ తీసుకొని లోతుగా విచారణ జరిపితేనే బినామీల గుట్టు రట్టవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.