మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Jayashankar - Sep 16, 2020 , 04:53:25

భూపాలపల్లి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి

భూపాలపల్లి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి

  • కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌

భూపాలపల్లి, కలెక్టరేట్‌ 15 : పారిశుధ్య కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించి భూపాలపల్లి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్‌ మహ్మ ద్‌ అబ్దుల్‌ అజీమ్‌ మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో మున్సిపల్‌ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. పట్టణంలో చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పట్టణ ప్రగతి ద్వారా పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం రూ.56 లక్షలు ఇస్తున్నదని, ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పట్టణంలో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న 12 టాయిలెట్లను పది రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. వీధి వ్యాపారులకు రుణాలు అందించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌, సింగరేణి జీఎం నిరీక్షణ్‌రాజ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


logo