శుక్రవారం 30 అక్టోబర్ 2020
Jayashankar - Sep 16, 2020 , 04:53:25

జిల్లాకు చేరిన సర్కారు సారె

జిల్లాకు చేరిన సర్కారు సారె

  • ములుగు జిల్లా వ్యాప్తంగా 1,06,882 బతుకమ్మ చీరెలు సిద్ధం 
  • రెండు స్టాక్‌ పాయింట్ల నుంచి పంపిణీ 

ములుగు, సెప్టెంబర్‌15 : ఆడపడుచులకు ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరెలు జిల్లాకు మంగళవారం చేరాయి. ప్రత్యేక గదిలో చీరెలను  భద్రపర్చిన అధికారులు జిల్లాలోని ఆయా మండల, గ్రామ స్థాయిల్లో ఉన్న రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

జిల్లా వ్యాప్తంగా 1,06,882 చీరెలు

ములుగు జిల్లాలోని తొమ్మిది మండలాల్లోని 174 గ్రామ పంచాయతీలకు చెందిన యువతులతో పాటు మహిళలకు 1,06,882 బతుకమ్మ చీరెలను సర్కార్‌ అందించనుంది. ములుగు మండలంలో 21553, ఏటూరునాగారంలో 10506, కన్నాయిగూడెంలో 4420, వాజేడులో 9497, వెంకటాపూర్‌ నూగూరులో 11733, మంగపేటలో 16972, తాడ్వాయిలో 7997, గోవిందరావుపేటలో 11644, వెంకటాపూర్‌లో 12560 చీరెలను పంపిణీ చేయనున్నారు. ఇందుకు జిల్లాలో ములుగు, మంగపేట మండలాల్లో స్టాక్‌ పాయింట్లను ఏర్పాటు చేసి ఇద్దరు ఏపీఎంలను స్టాక్‌ ఇన్‌చార్జిలుగా  డీఆర్‌డీఏ పీడీ పారిజాతం నియమించారు. వీటిని స్టాక్‌ పాయింట్‌ నుంచి గ్రామాల వారీగా రేషన్‌ షాపులకు చేర్చి అక్టోబర్‌ 1 నుంచి పంపిణీ చేయనున్నారు.