మంగళవారం 20 అక్టోబర్ 2020
Jayashankar - Sep 01, 2020 , 04:09:21

ఇంకా నిర్ధారణ కాలేదు

ఇంకా నిర్ధారణ కాలేదు

  • సీసీఎఫ్‌ అక్బర్‌

భూపాలపల్లి : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి సంచరించినట్లు ఇంకా నిర్దారణ కాలేదు. మరో మూడు రోజు ల్లో ఏ విషయమైనా తెలుస్తుందని వరంగల్‌ సర్కిల్‌ సీసీఎఫ్‌( చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌) ఎంజే అక్బర్‌ అన్నారు.

సోమవారం భూపాలపల్లి జిల్లాకు వచ్చిన ఆయన విలేకరులతో మా ట్లాడారు. యామన్‌పల్లి, నిమ్మగూడెం, మహబూబ్‌పల్లి అటవీ ప్రాంతాల్లో కన్పించిన పాదముద్రలు పెద్దపులివా, చిరుతపులి వా అనే విషయం నిర్ధారించాల్సి ఉందన్నారు. పులి సంచరించే అవకాశం ఉన్న భూపాలపల్లి, ములుగు జిల్లాలోని అటవీ దారు ల్లో ట్రాప్‌ కెమెరాలు ఆమర్చామని చెప్పారు. దండోరా వేసి  అటవీ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామన్నారు.

స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ఏఎన్‌ఆర్‌లో భాగంగా అడవుల పునరుద్ధరణ చేపట్టారన్నారు. ఈ నేపథ్యంలో 30 సంవత్సరాల తర్వా త ఆదిలాబాద్‌ అడవుల్లోకి మహారాష్ట్ర నుంచి పెద్దపులులు వచ్చాయన్నారు. ఛత్తీస్‌గఢ్‌ ఇంద్రావతి రిజర్వ్‌ ఫారెస్ట్‌, మహారాష్ట్ర తడోబా రిజర్వ్‌ ఫారెస్ట్‌ నుంచి మన జిల్లా అడవుల్లోకి పులులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. కవ్వాల టైగర్‌ జోన్‌ నుంచి పులులు ఇటువైపునకు వచ్చాయా? అనే విషయమై అక్కడి అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. ఆయన వెంట డీఎఫ్‌వో పురుషోత్తం, ఎఫ్‌డీవోలు ఉన్నారు.


logo