శనివారం 24 అక్టోబర్ 2020
Jayashankar - Aug 31, 2020 , 04:20:21

ఆజంనగర్‌లో పులి కదలికలుపు

ఆజంనగర్‌లో పులి కదలికలుపు

  • లి పిల్లతో కలిసి రెండు గ్రామాల్లో సంచారం
  • నిమ్మగూడెంలో ఆవును చంపిన ఆనవాళ్లు
  • పాదముద్రలను సేకరించిన అటవీ సిబ్బంది
  • ఎక్కడినుంచి వచ్చిందో ఆరా తీస్తున్న అధికారులు
  • సమీప గ్రామాలకు హెచ్చరికలు జారీ

మహాముత్తారం, ఆగస్టు 30 : మండలంలోని యామన్‌పల్లి శివారు ఆజంనగర్‌లో ఆదివారం ఉదయం  పులి పాదాలు కనిపించడంతో ఆదివాసీలు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఆజంనగర్‌ రేంజ్‌ అటవీశాఖ అధికారులు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు.

మట్టి రోడ్డుపై ఏర్పడిన పులి పాదాల అచ్చుల కొలతలు తీశారు. నమూనాలు సేకరించి వైల్డ్‌ లైఫ్‌ అధికారులకు పంపించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా మూడు రోజుల క్రితం నిమ్మగూడేనికి చెందిన నూనావత్‌ (నల్లగుంట) సమ్మయ్యకు చెందిన ఆవు మూడు రోజులుగా ఇంటికి రాలేదు. దీంతో శనివారం గ్రామస్తులతో కలిసి అడవిలో గాలించడంతో ఆవు మృతి చెంది కనిపించింది. కళేబరం వద్ద పులి, పులి పిల్ల పాదాలు కనిపించినట్లు సదరు రైతు చెప్పాడు. పులి దాడిలో ఆవు మృతి చెందిన విషయం తెలుసుకున్న పెగడపల్లి ఇన్‌చార్జి రేంజర్‌ ముషీర్‌ తన సిబ్బందితో కలిసి కళేబరం ఉన్న ప్రాంతానికి వెళ్లి పులి, పులి పిల్ల అడుగుల కొలతలు, నమూనాలు సేకరించారు.

అనంతరం పెగడపల్లి, ఆజంనగర్‌ ఇన్‌చార్జి రేంజర్లు ముసీర్‌, ఆదిల్‌ విలేకరులతో మాట్లాడు తూ.. పులుల ఆనవాళ్లు సేకరించాం. పులులు వచ్చాయనే భయంతో ఉచ్చులు లేదా విద్యుత్‌ తీగలు అమర్చొద్దన్నారు.  అయితే మహారాష్ట్రలోని తడోబా నుంచి ఆదిలాబాద్‌ మీదు గా వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పలిమెల మండలానికి ఆనుకోని మహారాష్ట్ర సరిహద్దు ఉంటుంది. ఇటీవలి వర్షాలకు ముందే ఈ ప్రాంతానికి చేరి ఉంటుందని అనుమానిస్తున్నారు.


logo