బుధవారం 21 అక్టోబర్ 2020
Jayashankar - Aug 31, 2020 , 03:54:25

మద్యం అధిక ధరలకు కళ్లెం..!

మద్యం అధిక ధరలకు కళ్లెం..!

  •  ఎమ్మార్పీకి మించి  విక్రయించకుండా చర్యలు
  •  పలుచోట్ల ఇష్టారీతిన అమ్మకాలపై  కలెక్టర్‌ ఆరా
  • కలెక్టర్‌ అజీమ్‌ ఆదేశాలతో త్వరలో రంగంలోకి టాస్క్‌ఫోర్స్‌
  • నిత్యం షాపుల తనిఖీ చేయనున్న 
  •          ఎక్సైజ్‌ అధికారులు

జయశంకర్‌భూపాలపల్లి, నమస్తేతెలంగాణ : మద్యం అధిక ధరలకు కళ్లెం వేసేందుకు ఎక్సైజ్‌ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లాలోని పలు మండలాల్లో ఎమ్మార్పీ కంటే ఎ క్కువగా డబ్బులు వసూలు చేస్తునారనే ఆరోపణలు ఉన్నా యి. గణపురం, రేగొండ మండల్లోని వైన్‌ షాపుల ఎదుట వినియోగదారులు, పలు సాంఘాలు ఆందోళనకు దిగాయి. అంతేకాకుండా పలు చోట్ల నుంచి ఫిర్యాదులు వెళ్లువెత్తాయి. దీంతో శనివారం కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ ఎక్సైజ్‌ శా ఖ సూపరిటెండెంట్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టాస్క్‌ఫోర్స్‌ టీంలు ఏర్పాటు చేసి వైన్‌ షాపులను తనిఖీ చే యాలని ఆదేశించిన విషయం తెలిసిందే. 

జిల్లాలో 26 మ ద్యం షాపులకు  భూపాలపల్లి ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలో 15, కాటారం పరిధిలో 11 మద్యం షాపులు నిర్వహిస్తున్నారు. అయితే వ్యాపారులు సిండికేట్‌గా మారి ఎమ్మార్పీ కంటే అధి క ధరలకు మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కోల్‌బెల్ట్‌ ఏరియాగా ఉన్న భూపాలపల్లిలో మరీ అధ్వానంగా తయారైనట్లు తెలిసింది. ఆబ్కారీ శాఖ నిబంధనల ప్రకారం షాపులను ఉద యం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచాలి. కానీ, అందుకు విరుద్ధంగా సాయంత్రం ఆ రు గంటలకే మూసి బెల్ట్‌ షాపులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిసింది. మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్న మద్యాన్ని బెల్ట్‌ షాపులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. వైన్స్‌లో మాత్రం తక్కువ డిమాం డ్‌ ఉన్న మందు అమ్ముతున్నట్లు తెలిసింది. ఎక్సైజ్‌ శాఖలోని పలువురు అధికారుల అండదండలతోనే వ్యాపారులు ఇలా చేస్తున్నారని మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ ఎక్సైజ్‌ అధికారులతో సమావేశం నిర్వహించి  మద్యం  షాపుల సమయపాలన, అధిక ధరలపై అధికారులను వివరణ కోరినట్లు తెలిసింది.  ఇందులో భాగంగా ఆదివారం కాటారం సబ్‌ డివిజన్‌ పరిధిలో ఎక్సైజ్‌ సీఐ ప్రశాంతి పలు షాపుల్లో తనిఖీలు చేశారు. 

ఇష్టం వచ్చిన బ్రాండ్లు విక్రయిస్తున్న వ్యాపారులు

జిల్లాలోని వైన్స్‌ షాపుల్లో వ్యాపారులు తమకు ఇష్టం వచ్చిన బ్రాండ్లను విక్రయిస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. మద్యం ప్రియులకు కావాల్సిన బ్రాండ్‌ అడిగితే వేరేవి కట్టబెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ టీంలు!

మద్యం ధరల నియంత్రణకు ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ టీంలు ఏర్పాటు చేయాలని  జిల్లా ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ను కలెక్టర్‌ ఆదేశించారు. ప్రత్యేక బృందాలతో షాపులపై నిరంతరాయంగా దాడులు నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిసింది. ఎమ్మార్పీకంటే మించి విక్రయిస్తున్న షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.logo