మంగళవారం 27 అక్టోబర్ 2020
Jayashankar - Aug 24, 2020 , 05:13:54

పలువురు ఎఫ్‌ఎస్‌వోలకు డిప్యూటేషన్‌

పలువురు ఎఫ్‌ఎస్‌వోలకు డిప్యూటేషన్‌

భూపాలపల్లి : జిల్లాలో పలువురు ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్లను డిప్యూటేషన్‌పై పంపినట్లు జయశంకర్‌ భూపాలపల్లి ఇన్‌చార్జి డీఎఫ్‌వో వజ్రారెడ్డి ఆదివారం తెలిపారు. మహదేవ్‌పూర్‌ అటవీ రేంజ్‌ పరిధిలోని ముక్తీశ్వర వనంలో ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్‌(ఎఫ్‌ఎస్‌వో)గా పనిచేస్తున్న మక్బూల్‌ను, సూరారం ఎఫ్‌ఎస్‌వోగా పంపారు. సూరారంలో పనిచేస్తున్న వరుణ్‌ను భూపాలపల్లి అటవీ రేంజ్‌ పరిధిలోని గొర్లవీడుకు పంపారు. గొర్లవీడులో పనిచేస్తున్న హన్మంత్‌ను పెగడపల్లి అటవీ రేంజ్‌ కనుకునూర్‌కు పంపారు. కనుకునూర్‌లో పనిచేస్తున్న అంజయ్యను భూపాలపల్లికి కేటాయించారు.  పనిచేస్తున్న సంతోష్‌ను కమలాపూర్‌కు డిప్యూటేషన్‌పై పంపినట్లు పేర్కొన్నారు. logo