మంగళవారం 20 అక్టోబర్ 2020
Jayashankar - Aug 19, 2020 , 02:03:31

సర్దార్‌ పాపన్నగౌడ్‌కు ఘన నివాళి

సర్దార్‌ పాపన్నగౌడ్‌కు ఘన నివాళి

కాటారం/ భూపాలపల్లి టౌన్‌/ చిట్యాల/ తాడ్వాయి/ మహాముత్తారం : సర్దార్‌ పాపన్నగౌడ్‌ జయంతిని మంగళవారం జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో నిర్వహించారు. బహుజన సంఘాలు, గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్‌ పాపన్నగౌడ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయన సేవలను కొనియాడారు. గౌడ జన హక్కుల పోరాట సమితి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని అమృత వర్షిణి అక్షర స్వచ్ఛంద సేవా సంస్థ వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్ర కుమారస్వామి గౌడ్‌, మహిళా రాష్ట్ర కార్యదర్శి పెరుమాండ్ల శ్రీలత, జిల్లా కన్వీనర్‌ బుర్ర రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. కాటారంలో గౌడ, బహుజన సంఘాల నాయకులు కందుగుల రాజన్న, బుర్ర లక్ష్మణ్‌గౌడ్‌, వేముల శ్రీశైలం పాల్గొన్నారు. చిట్యాలలో గౌడ సంఘం అధ్యక్షుడు బుర్ర శ్రీధర్‌, మంగపేటలో తెలంగాణ ఏజెన్సీ గౌడ హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బూర లక్ష్మీనారాయణగౌడ్‌ పాల్గొన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో ఎస్టీయూ భవనంలో కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో  జరిగిన కార్యక్రమంలో నాయకులు రవిగౌడ్‌, యాదగిరిగౌడ్‌, ముంజాల భిక్షపతిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. తాడ్వాయి మండలంలోని కాటాపురంలో ఎల్లమ్మ ఆలయం వద్ద మంగళవారం ఆసంఘం ములుగు జిల్లా అద్యక్షుడు పులి చిన్న నర్సయ్య గౌడ్‌ ఆద్వర్యంలో సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహాముత్తారం మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ నాయకులు సర్వాయి పాపన్న చిత్ర పటానికి పూల మాల వేసి, నివాళులర్పించారు.  ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మార్క రాముగౌడ్‌, రైతు బంధు మండల అధ్యక్షుడు మందల రాజిరెడ్డి, ఎంపీటీసీ శ్రీపతి సురేశ్‌, మినాజీపేట సర్పంచ్‌ ముత్యాల రాజు, టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు కోడూరి సతీశ్‌గౌడ్‌, నాయకులు వేముల వెంకటేశ్‌ గౌడ్‌,మధునయ్య, గణేశ్‌,మహేశ్‌, శ్రీనివాస్‌గౌడ్‌,తిరుపతిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo