సోమవారం 19 అక్టోబర్ 2020
Jayashankar - Aug 19, 2020 , 02:03:32

వరద నివారణకు శాశ్వత చర్యలు

వరద నివారణకు శాశ్వత చర్యలు

ఏటూరునాగారం, ఆగస్టు 18 : వరద నివారణకు శాశ్వత చర్యలు చేపడుతామని, ప్రజలు ఆందోళన చెందవద్దని జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ అన్నారు. గత మూడు రోజులుగా ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం, వాజేడు మండలాల్లో పర్యటిస్తున్న ఆయన మంగళవారం మండల కేంద్రంలోని వరదలను పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వర్షాలు, వరదలకు తట్టుకునే విధంగా శాశ్వత ప్రతిపాదికన రూప కల్పన చేస్తామన్నారు. సహాయక చర్యల్లో టీఆర్‌ఎస్‌ శ్రేణుల సేవలు మరువలేమన్నారు. వర్షాలకు అబ్దుల్‌ అజీం ఇంటి గోడలు కూలగా పరిశీలించారు. వారితో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కలెక్టర్‌ దృష్టికి తీసుకపోయి డబుల్‌ బెడ్రూం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. కూలిన ఇండ్లు, గోడల వివరాలను వెంటనే వీఆర్‌వో, తహసీల్దార్‌ దృష్టికి తీసుకపోవాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.  అనంతరం టీఆర్‌ఎస్‌ నాయకుడు వలిబాబా ఇటీవల మృతిచెందగా కుటుంబాన్ని పరామర్శించారు. మండలంలోని వీరాపూర్‌, చెల్పాక, బానాజీ బంధం గ్రామాలను సందర్శించారు. దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారు. ఎలిశెట్టిపల్లి గ్రామానికి అడ్డుగా ఉన్న వాగులో బోటులో వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడి వారికి బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. వీలైనంత త్వరగా వాగుపై వంతెన నిర్మించేందుకు ప్రయత్నం చేస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. నిత్యావసర సరుకుల కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఆయన వెంట పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గడదాసు సునీల్‌ కుమార్‌, జిల్లా కో ఆప్షన్‌ సభ్యురాలు వలియాబీ, ఆత్మ చైర్మన్‌ రమణయ్య, మేడారం ట్రస్టుబోర్డు చైర్మన్‌ ఆలం రామ్మూర్తి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య,  టీఆర్‌ఎస్‌ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, సర్దార్‌పాషా, కిరణ్‌, సిద్దబోయిన రాంబాబు, అజ్మత్‌ఖాన్‌, మహేశ్‌, చంద్రబాబు, తాహెర్‌ పాషా, కృష్ణారెడ్డి, నాయకులు వావిలాల రాంబాబు, ఎంపీటీసీ కోట నర్సింహులు, ఎస్సై శ్రీకాంత్‌ రెడ్డి తదితరులు ఉన్నారు. 

కన్నాయిగూడెం మండలంలో పర్యటన

కన్నాయిగూడెం : మండలంలోని బుట్టాయిగూడెం జీపీ పరిధి  కొత్తూరు గ్రామంలోని లోతట్టు ప్రాంతంలో జడ్పీ చైర్మన్‌ జగదీశ్వర్‌ రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్యతో కలిసి పర్యటించారు. ఎత్తైన ప్రాంతంలో డబు ల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. సర్పంచ్‌ కావిరి పద్మతో అందుకు సంబంధించిన పూర్తి నివేదికను సిద్ధం చేయాలన్నారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సుబ్బుల సమ్మయ్య, సునీల్‌కుమార్‌, పుజరి సత్యనారాయణ, చిన్ని కృష్ణ, వనపర్తి రామయ్య, నారాయణ, తుమ్మ మల్లారెడ్డి ఉన్నారు.


logo