గురువారం 22 అక్టోబర్ 2020
Jayashankar - Aug 19, 2020 , 02:03:34

గోదావరి తీరం రివిట్‌మెంట్‌కు కృషి

గోదావరి తీరం రివిట్‌మెంట్‌కు కృషి

మంగపేట, ఆగస్టు18: మంగపేట పుష్కరఘాట్‌ సమీప గోదావరి తీరం కోత సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి, తీరానికి అవసరమైన రివిట్‌మెంట్‌ నిర్మాణానికి కృషి చేస్తానని మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత అన్నారు. నదీ ప్రవాహానికి కోతకు గురవుతున్న గోదావరి తీర ప్రాంతా న్ని ఆమె మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తీరప్రాంత వాసులు, రైతులను సమస్యలు అడిగి తెలుసుకు న్నారు. అనంతరం మాట్లాడుతూ గతంలో అజ్మీరా చందూలాల్‌ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే సమస్యను క్షేత్ర స్థాయిలో గుర్తించేందుకు అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఇతర మంత్రుల బృందాన్ని మంగపేటకు తీసుకొచ్చి, తీరానికి సీసీతో రివిట్‌ మెంట్‌ కోసం రూ.150 కోట్లు అవసరమవుతాయని ప్రపోజల్స్‌ పంపినట్లు గుర్తు చేశారు. మరోవైపు ప్రస్తుత జిల్లా మంత్రులు సత్యవతి రాథోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా ఈప్రాంత టీఆర్‌ఎస్‌ నాయకుల అభీష్టం మేరకు గోదావరి తీర సమస్యపై ముఖ్యమంత్రితో మాట్లాడినట్లు తెలిపారు. ఇటీవల మాజీ మంత్రి చందూలాల్‌ తనతో తీర ప్రాంత సమస్యపై చర్చించినట్లు పేర్కొన్నారు. వరదల వల్ల దెబ్బతిన్న మిర్చి నారుమడులు, వరి పొలాల విషయంపై కలెక్టర్‌ ద్వారా సమగ్ర నివేదిక తీసుకుని, బాధిత రైతులకు ప్రభుత్వ సహాయం అందేలా చూస్తామన్నారు. అంతకు ముందు తీర ప్రాంత వాసులతో మాట్లాడి, పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఎంపీ వెంట టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు కాకులమర్రి లక్ష్మణ్‌రావు, సీనియర్‌ నేత గోవిందనాయక్‌, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్‌ సామా మోహన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ శిద్దంశెట్టి వైకుంఠం, సహకార డైరక్టర్‌ నర్రా శ్రీధర్‌, కోదండం, మాజీ మండల అధ్యక్షుడు నేలపట్ల రామచంద్రారెడ్డి, మేడారం డైరక్టర్‌ రాజేందర్‌, మాజీ మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ కోరెం సంతోష్‌, మండవ రామకృష్ణ, ఇంతియాజ్‌ బుట్టో, రాణాప్రతాప్‌రెడ్డి, పోలిన హరిబాబు, కర్రి శ్యాంబాబు, నవీన్‌రెడ్డి, మూగల రమేశ్‌, అయూబ్‌, బచ్చలకూరి ప్రసాద్‌, శానం నరేందర్‌, ప్రశాంత్‌, అర్జున్‌, అన్వర్‌, కరుణాకర్‌ తదితరులున్నారు.

మోడికుంట ప్రాజెక్టు నిర్మాణ పనులకు కృషి 

వాజేడు  : మోడికుంట ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టేలా కృషి చేస్తానని మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత అన్నారు. స్థానిక తహసీల్‌ కార్యాలయం లో మంగళవారం ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. మోడికుంట ప్రాజెక్టు పనులు నిలిచిన విషయాన్ని మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సైతం సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. వరద ముంపు ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో బాధితులకు సహాయ సహకారాలు అందించాలన్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ కార్యాలయ అధికారులకు శానిటైజర్లు అందజేశారు. సమావేశంలో జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌, వైస్‌ చైర్మన్‌ బడే నాగజ్యోతి, జడ్పీటీసీ తల్లడి పుష్పలత, ఏఎంసీ చైర్మన్‌ బుచ్చయ్య, సర్పంచ్‌ తల్లడి ఆదినారాయణ,  టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పెనుమళ్లు రామకృష్ణారెడ్డి, తహసీల్దార్‌ బాబ్జిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు . 


logo