మంగళవారం 20 అక్టోబర్ 2020
Jayashankar - Aug 15, 2020 , 06:33:42

సందర్శనకు వెళ్లి విగతజీవులై..

సందర్శనకు వెళ్లి విగతజీవులై..

  • n ఏడుబావుల జలపాతంలో పడి ఇద్దరు యువకులు మృతి
  • n మృతులు ఖమ్మం జిల్లాకు చెందిన విష్ణువర్ధన్‌రెడ్డి, అంజిరెడ్డి 


గంగారం, ఆగస్టు  14 : గంగారం, బ య్యారం సరిహద్దు మిర్యాలపెంట గ్రామ సమీపంలోని ఏడు బావుల జలపాతంలో పడి ఇద్దరు యువకులు శుక్రవారం  మృ తి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలానికి చెందిన ఏడుగురు యువకులు ఏడుబావుల జలపాతం చూసేందుకు వచ్చా రు. అయితే బావుల వద్ద ఉన్న గుట్టలను ఎక్కుతున్న క్రమంలో నారాయణ పురం గ్రామానికి చెందిన శీలం విష్ణువర్ధన్‌రెడ్డి (21), బోడమల్లకు చెంది న  యనమల అంజిరెడ్డి కింద ఉన్న నీటి ప్రవాహంలో పడి మృతి చెందారు. విష్ణువరన్ధ్‌రెడ్డి మృతదేహం లభించగా అంజిరెడ్డి మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, ఘటనా స్థలాన్ని ఎస్సై రామారావు పరిశీలించారు. 

బొర్రవాగులో బైక్‌తో సహా పూజారి..


కాటారం : భారీ వర్షాలతో పోతులవాయి సమీపంలోని బొర్రవాగు లో లెవ ల్‌ కాజ్‌వే పై నుంచి ఉప్పొంగి ప్రవహిస్తుండగా ఇబ్రహీంపల్లికి చెందిన వంగల వెంకటస్వామి అనే పూజారి బైక్‌తో సహా వరదనీటిలో పడి గల్లంతైనట్లు సమాచా రం. మహదేవపూర్‌కు పూజా కార్యక్రమాలకు వెళ్లి గురువారం రాత్రి తిరిగి ఇంటికి వస్తుండగా వాగుపై ఉన్న కాజ్‌వేను దాటుతుండగా ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. అతడి ఫోన్‌ స్విచ్చా ఫ్‌ వస్తుండడంతో పాటు బైక్‌పై వస్తూ వా గులో పడినట్లు చూశానని పోతులవాయి కి చెందిన ఓ వ్యక్తి తెలపడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. గారెపల్లిలోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో పనిచేస్తున్న అనిల్‌కుమార్‌ అనే యువకుడు సైతం గురువారం రాత్రి బైక్‌పై మాదారం వెళ్తూ బొర్రవాగు ప్రవాహంలో పడిపోయాడు. కాగా, అనిల్‌ వెంటనే రోడ్డు అం చును పట్టుకొని పైకి చేరగా బైక్‌ నీటిలో పడింది. వెంకటస్వామి కుటుంబ సభ్యు లు ఇచ్చిన సమాచారం మేరకు శుక్రవా రం తహసీల్దార్‌ సునీత, ఎస్సై నరేశ్‌ ఆధ్వర్యంలో స్థానికులు, పోలీసులు నీటిలో వెదకగా అనిల్‌కు చెందిన బైక్‌ లభ్యమైం ది. వెంకటస్వామితో పాటు అతడి బైక్‌ లభ్యం కాలేదు. దీంతో అతడి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరు గా విలపిస్తున్నారు. సింగరేణి రెస్క్యూ టీం సహాయంతో గాలింపు చేపడతామని అధికారులు తెలిపారు. 

చెరువులో గల్లంతైన యువకుడి మృతి 


తాడ్వాయి : మండలకేంద్రంలోని ఎ ర్రగుంట చెరువులో చేపల వేటకు వెళ్లి నీ ట మునిగి గల్లంతైన యువకుడు గంగ య్య (20) మృతి చెందాడు. చెరువులో చేపలు పట్టేందుకు తన భార్యతో కలిసి వచ్చిన గంగయ్య గురువారం గల్లంతైన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న తాడ్వాయి ఎస్సై రవీందర్‌ సిబ్బం ది, స్థానికుల సహాయంతో గాలింపు చేపట్టినా గంగయ్య ఆచూకీ లభించలేదు. చీ కటి పడడంతో గాలింపు ఆపి వేసి శుక్రవారం ఉదయం చెరువులో గాలించగా గంగయ్య మృతదేహం లభించింది. మృ తదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏటూరునాగారం దవాఖానకు తరలించారు.  


logo