ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Jayashankar - Aug 14, 2020 , 02:26:13

చెరువులో ఒకరి గల్లంతు?

చెరువులో ఒకరి గల్లంతు?

తాడ్వాయి: మండల కేంద్రంలోని ఎస్టీ కాలనీ సమీపంలోని ఎర్రగుంట చెరువు లో గంగయ్య గల్లంతయ్యాడు. స్థానిక ఎస్‌ఐ రవీందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొడపర్తి గ్రామ సమీపంలోని గొత్తికోయగూడేనికి చెందిన గంగయ్య తన భార్యతోపాటు మరో ఇద్దరితో కలిసి గురువారం ఉదయం చేపలు పట్టేందుకు ఎర్రగుంట చెరువుకు వచ్చాడు. మిగతా ముగ్గురు చెరువు కింద ఉన్న కాల్వలో వల లతో చేపలు పడుతుండగా గంగయ్య మాత్రం చెరువులో చేపలు పడతానని వెళ్లి చాలా సేపటి వరకు రాలేదు. దీంతో మిగతా ముగ్గురు పోలీసులకు సమాచారం ఇ చ్చారు. ఎస్‌ఐ సిబ్బందితో కలిసి వెళ్లి స్థానికులతో కలిసి చెరువులో వెతికినప్పటికీ జాడ దొరకలేదు. గంగయ్య చెరువులో దిగి మునిగిపోయాడా.. లేక వారికి చెప్ప కుండా ఎటైనా వెళ్లాడా అన్నది తెలియడం లేదని ఎస్‌ఐ రవీందర్‌ తెలిపారు. logo