శనివారం 31 అక్టోబర్ 2020
Jayashankar - Aug 10, 2020 , 01:19:45

రైతుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం... గండ్ర వెంకటరమణారెడ్డి

రైతుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం... గండ్ర వెంకటరమణారెడ్డి

రేగొండ, ఆగస్టు 9 : రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.  మండల కేంద్రంతో పాటు, సుల్తాన్‌పూర్‌ గ్రామంలో రైతు వేదిక భవనాలు, కొత్తపల్లి(గోరి)లో సెంట్రల్‌ లైటింగ్‌ను ఆయన ఆదివారం ప్రారంభించారు  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో రైతుల కోసం సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రైతు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదన్నారు. రైతును రాజు చేయడానికే గ్రామాల్లో రైతు వేదిక భవనాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. దసరా నాటికి వీటిని పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం 11 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ జీవాకర్‌రెడ్డి, ఏవో వాసుదేవారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ నడిపెల్లి విజ్జన్‌రావు, ఎంపీపీ పున్నం లక్ష్మి, జడ్పీటీసీ సాయిని విజయ, ఆలయ కమిటీ చైర్మన్‌ ఇంగే మహేందర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మోడెం ఉమేశ్‌గౌడ్‌, సర్పంచ్‌లు ఏడునూతుల నిషిధర్‌రెడ్డి, అంబాల చందు, ఎంపీటీసీ గండు కుమారస్వామి, మైస సుమలత భిక్షపతి, సామాల పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.