శనివారం 24 అక్టోబర్ 2020
Jayashankar - Aug 09, 2020 , 01:43:53

కలెక్టర్‌ చొరవతో క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం

కలెక్టర్‌ చొరవతో క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం

భూపాలపల్లి కలెక్టరేట్‌, ఆగస్టు 8 : కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ శుక్రవారం తన అధికారిక వాహనంలో సింగరేణి బంగ్లాస్‌ ఏరియాలో హరితహారం కార్యక్రమాన్ని పరిశీలించి ప్రధాన రహదారికి వస్తుండగా ఓ ద్విచక్ర వాహనదారుడు కలెక్టర్‌ వాహనాన్ని సైడ్‌ నుంచి ఢీ కొట్టాడు. దీంతో ద్విచక్ర వాహనదారుడు కింద పడగా అతడికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన కలెక్టర్‌ క్షతగాత్రుడిని తన క్యాంపు కార్యాలయ సీసీ శివ ద్వారా 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం సింగరేణి దవాఖానకు తరలించారు. దగ్గరుండి చికిత్స అందించాలని కలెక్టర్‌ శివకు సూచించారు. కాగా, ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు తెలిపారు.logo