బుధవారం 30 సెప్టెంబర్ 2020
Jayashankar - Aug 08, 2020 , 02:51:51

‘ఇంటింటా ఇన్నోవేషన్‌' దరఖాస్తు గడువు పెంపు

‘ఇంటింటా ఇన్నోవేషన్‌' దరఖాస్తు గడువు పెంపు

భూపాలపల్లి కలెక్టరేట్‌, ఆగస్టు 7 : స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా ఇంటిం టా ఇన్నోవేషన్‌ పేరుతో ఆన్‌లైన్‌లో నిర్వహించే సృజనాత్మక ఆవిష్కరణల ప్రదర్శనకు ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తు గడువు పొడిగించినట్లు కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సృజనాత్మకతను ప్రోత్సహించడానికి తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా ఇన్నోవేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఈ ప్రదర్శనలో పాల్గొనడానికి అన్ని రంగాలు, అన్ని వర్గాల ఆవిష్కరణలను పోత్సహిస్తున్నామన్నారు. గ్రామీణ, విద్యార్థి, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించిన ఆవిష్కరణలను అంగీకరిస్తామని తెలిపారు. రెండు నిమిషాల నిడివి గల ఆవిష్కరణ వీడియో, నాలుగు ఫొటోలు, పేరు, వయ స్సు, వృత్తి, ఊరు, జిల్లా వివరాలను 9100678543 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా ఈ నెల 10 లోపు పంపించాలని కలెక్టర్‌ ఆ ప్రకటనలో తెలిపారు.


తాజావార్తలు


logo