శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Jayashankar - Aug 07, 2020 , 04:52:42

మస్టర్లు నిండిన బదిలీ వర్కర్లకు త్వరలో ఉద్యోగోన్నతి

మస్టర్లు నిండిన బదిలీ వర్కర్లకు త్వరలో ఉద్యోగోన్నతి

భూపాలపల్లి: 2019- 2020 వార్షిక సంవత్సరంలో యూజీ -190, సర్ఫెస్‌ -240 మస్టర్లు నిండిన  సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న బదిలీ వర్కర్స్‌ కార్మికులకు త్వరలోనే జనరల్‌ మజ్ధూర్‌గా ఉద్యోగోన్నతి లభిస్తుందని, సింగరేణి గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్‌ భూపాలపల్లి ఏరియా బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షులు కొక్కుల తిరుపతి వెల్లడించారు. గురువారం స్థానిక టీబీజీకేఎస్‌ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) బదిలీ వర్కర్స్‌ కార్మికులకు అండగా నిలిచి, ఈ పదోన్నతి ఉత్తర్వుల లేఖలు అందిస్తుందన్నారు. భూపాలపల్లి ఏరియా  ఏఐటీయూసీ  నాయకులు కొందరు పదోన్నతి వచ్చే సమాచారం తెలుసుకొని, తమ  యూనియన్‌ కృషి వల్లనే పదోన్నతులు వస్తున్నట్లు ప్రచారం చేసుకోవడం  సిగ్గుచేటని అన్నారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న బదిలీ వర్కర్స్‌ కార్మికులకు అండర్‌ గ్రౌండ్‌లో పనిచేసే వారు 190 మస్టర్లు, సర్ఫెస్‌లో పనిచేస్తున్నవారు 240 మస్టర్లు నిండిన వారికి ఈ పదోన్నతులను త్వరలోనే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇప్పిస్తుందన్నారు. 

ఎన్నికలు వాయిదా వేయాలి

కొవిడ్‌-19 తగ్గే వరకు సింగరేణిలో ఎన్నికలు వాయిదా వేయాలని భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యత కేంద్రం( మా.లే) రాష్ట్ర కమిటీ కార్యదర్శి గడ్డం సదానందం  గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు ఆర్‌ఎల్‌సీ ( సెంట్రల్‌) హైదరాబాద్‌,  ఏడు రోజుల్లో  యూనియన్ల రిజిస్ట్రేషన్‌ తదితర వివరాలను పంపించాలని నోటిఫికేషన్‌ జారీ చేసిందని పేర్కొన్నారు. సింగరేణిలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని, ఎన్నికలు నిర్వహించడం సరికాదని పేర్కొన్నారు.  వెంటనే వాయిదా వేయాలని కోరారు.


logo