శనివారం 31 అక్టోబర్ 2020
Jayashankar - Aug 07, 2020 , 04:11:19

సార్‌ ఆశయాలను కొనసాగిద్దాం

సార్‌ ఆశయాలను కొనసాగిద్దాం

  • జయశంకర్‌సార్‌ జయంతిలో  వక్తలు

నమస్తే తెలంగాణ, నెట్‌వర్క్‌: తెలంగాణ ఉద్యమ సిద్ధ్దాంతకర్త ఆచార్య జయశంకర్‌సార్‌ సార్‌ ఆశయాలను కొనసాగిద్దామని వక్తలు అన్నారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో గురువారం జయశంకర్‌సార్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెండు జిల్లాల్లోని అన్ని మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన చిత్రపటాకి పూలమాల వేసి నివాళులర్పించారు. భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు జయశంకర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూపాలపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ శ్రీనివాసులు జయశంకర్‌సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూపాలపల్లి మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి, వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సీతక్క జయశంకర్‌ సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంగడి మైదానంలో ఆత్మ చైర్మన్‌ బైకాని ఓదెలు వేడుకల్లో పాల్గొన్నారు. ములుగు కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ ఆదర్శ్‌సురభి సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయా మండలాల అధికారులు, ప్రజాప్రతినినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు జయశంకర్‌ సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.