శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Jayashankar - Aug 06, 2020 , 03:58:42

సమస్యల పరిష్కారానికే ‘రైతు వేదికలు’

సమస్యల పరిష్కారానికే ‘రైతు వేదికలు’

మొగుళ్లపల్లి, ఆగస్టు 5 : అన్నదాతల సమస్యల పరిష్కారానికి ‘రైతు వేదిక’లు దోహదపడుతాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని రంగాపురం మొగుళ్లపల్లి, ములుకలపల్లి, పర్లపల్లి, వేమలపల్లి గ్రామాల్లో నిర్మించ నున్న రైతు వేదిక భవనాలకు గండ్ర శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. రైతులకు సమస్యలు వస్తే ఒక వేదిక అవసరం అని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. మండలానికి ఐదు క్లస్టర్లను ఏర్పాటు చేసి ఒక్కో వేదికను రూ.22 లక్షలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. మొగుళ్లపల్లి మండలానికి రూ. కోటి పది లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ రాణి, ఎంపీడీవో రామయ్య, సొసైటీ చైర్మన్‌ సంపెల్లి నర్సింగరావు, వైస్‌ ఎంపీపీ పోల్నేని రాజేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి పున్నం చందర్‌రావు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి, కటంగూరి శ్రీరాంరెడ్డి, సర్పంచులు బల్గూరి తిరుపతిరావు, మోటే ధర్మారావు, జోరుక ప్రేమలత, బెల్లంకొండ మాధవి, సరహరి వెంకట్‌రెడ్డి, ఏకాంబ రామారావు, దానవేన రాములు, ఏలేటి నర్సింహారెడ్డి, తదితరలు పాల్గొన్నారు.

నేడు గణపురంలో ఎమ్మెల్యే పర్యటన

గణపురం : మండలంలోని గణపురం, చెల్పూర్‌, ధర్మారావుపేట గ్రామాల్లో రూ.66 లక్షల నిధులతో నిర్మించనున్న రైతు వేదిక భవనాలకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గురువారం శంకుస్థాపన చేయనున్నట్లు గణపురం పీఏసీఎస్‌ చైర్మన్‌ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.  సమావేశంలో సర్పంచులు నారగాని దేవేందర్‌గౌడ్‌, నడిపెల్లి మధుసూదన్‌రావు, పోతుల ఆగమ్మ, ఎంటీసీలు పొపగంటి సుధర్మ మల్‌హల్‌రావు, చెన్నూరి రమాదేవి, మంద అశోక్‌రెడ్డి, జిల్లా నాయకులు ఐలోని రాంచంద్రారెడ్డి, పొలుసాని లక్ష్మీనర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.


logo