శనివారం 26 సెప్టెంబర్ 2020
Jayashankar - Aug 05, 2020 , 06:05:04

ఆధునిక వ్యవసాయాభివృద్ధికి రైతు వేదికలు

ఆధునిక వ్యవసాయాభివృద్ధికి రైతు వేదికలు

రేగొండ, ఆగస్టు 4 : ఆధునిక వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణాలకు సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నా రు. మంగళవారం  ఆయన మండలంలోని దమ్మన్నపేట, కనపర్తి, కోటంచ, భాగిర్దిపేట గ్రామాల్లో రైతు వేదిక భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతులు, వ్యవసాయ రంగానికి అమలు చేస్తున్న పథకాల్లో ఎలాంటి జాప్యం లేకుండా చూస్తున్నారన్నారు. ప్రభుత్వ అధికారులకు ఇచ్చే జీతాలు సగం మా త్రమే ఇచ్చి రైతులకు పూర్తి రైతుబంధు, పంట రుణ మాఫీ అమలు చేసి రైతు సంక్షేమ ప్రభుత్వం అని నిరూపించారని తెలిపారు. రైతులందరూ సమావేశమయ్యేందుకు ఒక వేదిక అవసరం అని గుర్తించిన ప్రభుత్వం రూ.22 లక్షల  వ్యయంతో రైతు వేదిక నిర్మాణానికి నాంది పలికారన్నారు. ఈ రైతు వేదికల శంకుస్థాపనకు రావడం సంతోషంగా ఉందన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పున్నం లక్ష్మి, జడ్పీటీసీ సాయిని విజయ, పీఏసీఎస్‌ చైర్మన్‌ విజ్జన్‌రావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మోడం ఉమేశ్‌గౌడ్‌, సర్పంచులు శ్రీనివా స్‌రావు, రంజిత్‌, శ్రీనివాస్‌, భాస్కర్‌, రైతులు పాల్గొన్నారు.logo