శనివారం 31 అక్టోబర్ 2020
Jayashankar - Aug 03, 2020 , 03:37:02

అంబర్‌ ప్యాకెట్ల పట్టివేత

అంబర్‌ ప్యాకెట్ల పట్టివేత

మొగుళ్లపల్లి, ఆగస్టు 2 : మండలంలోని ఇస్సిపేట శివారులో ఆదివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇచ్చంటాల ఓదెలు అనే వ్యక్తి ఆటోలో అంబర్‌ ప్యాకెట్లు తరలిస్తూ పట్టుబడినట్లు  ఎస్సై నిహారిక తెలిపారు. ఓదెలు టేకుమట్ల మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి కాగా, కొంత కాలంగా ఆయన అంబర్‌ ప్యాకెట్ల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. నాలుగు బస్తాల్లో ప్యాకెట్లు లభించాయని, వాటి విలువ సుమారు రూ.75 వేలు ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఓదెలును అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నట్లు ఎస్సై వివరించారు.