గురువారం 22 అక్టోబర్ 2020
Jayashankar - Aug 03, 2020 , 03:37:02

భూపాలపల్లిలో 11.7 మి.మీ వర్షపాతం

భూపాలపల్లిలో 11.7 మి.మీ వర్షపాతం

భూపాలపల్లి కలెక్టరేట్‌ : జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఆదివారం ఉదయం వరకు 11.7 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు జిల్లా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జిల్లా పరిధిలోని మహదేవ్‌పూర్‌, పలిమెల మండలాల్లో 5.8 మి.మీ, మహాముత్తారంలో 6.2, కాటారంలో 3.6, మల్హర్‌లో 2.4, చిట్యాల, టేకుమట్ల మండలాల్లో 26.6, మొగుళ్లపల్లిలో 10.8, రేగొండలో 28.2, గణపురంలో 11.6, భూపాలపల్లి మండలంలో 2.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వివరించారు. 


logo