శనివారం 08 ఆగస్టు 2020
Jayashankar - Aug 02, 2020 , 06:51:40

ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు

 ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు

  •   ములుగు, జయశంకర్‌ భూపాలపల్లిలో ఘనంగా  బక్రీద్‌ పండుగ  

న్యూస్‌నెట్‌వర్క్‌: త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్‌ పండుగను ముస్లింలు శనివారం ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో జరుపుకొన్నారు. ముస్లిం క్యాలెండర్‌ ప్రకారం చివరి నెల అయిన దూఅల్‌ ఇజాజ్‌ 10వ రోజును పవిత్రంగా భావించి ముస్లిం కుటుంబాల్లో మరణించిన వారి సమాధుల వద్దకు వెళ్లి స్మరించుకున్నారు. కొవిడ్‌-19 నిబంధనల ప్రకా రం ఇండ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కుర్భాని ఇచ్చేందుకు ఆహార పదార్థాలను తయారు చేసి పేద వారికి పంచారు. అం దించారు. వెంకటాపురం (నూగూరు) మండలంలో హుస్సేన్‌, బాషా, తదితరులు పాల్గొన్నారు. కాటారం మండలంలోని కాటారం, గారెపల్లి, గంగారం, విలాసాగర్‌, గూడూర్‌, దేవరాంపల్లి, చింతకాని, ఇబ్రహీంపల్లి, అంకుసాపూర్‌, దామెరకుంట గ్రామాలకు చెందిన ముస్లింలు బక్రీద్‌ను ఘనంగా జరుపుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. గణపురం మండల కేంద్రంతో పాటు చెల్పూర్‌, కేటీపీపీ, కర్కపల్లి, బుద్దారం, సీతారాంపూర్‌, బస్వరాజుపల్లి, ధర్మారావుపేట, రవీనగర్‌ గ్రామా ల్లో ముస్లింలు ఇళ్లలోనే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయా గ్రామాల సర్పంచులు నారగాని దేవేందర్‌గౌడ్‌, నడిపెల్లి మధుసూదన్‌రావు, పోట్ల నగేశ్‌, చెరుకు కుమారస్వామి, తోట మానస, గణపురం పీఏసీఎస్‌ చైర్మన్‌ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, ఎంపీటీసీలు పొనుగంటి సుధర్మ మల్‌హల్‌రావు, చెన్నూరి రమాదేవి, మంద అశోక్‌రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పలిమెల మండలంలోని లెంకలగడ్డ, పంకెన తదితర గ్రామాల్లో ముస్లింలు మసీదులకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. లెంకలగడ్డలో పలిమెల కో ఆప్షన్‌ సభ్యుడు నిజాం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కన్నాయిగూడెం మండలంలోని గూర్రేవుల, ముప్పన పల్లి, లక్ష్మీపురం, దేవాదుల గ్రామాల్లో ముస్లింలు ఇండ్లలో ప్రార్థనలు చేసి పండుగను ఘనంగా జరుపుకొన్నారు. చిట్యాల మండల కేంద్రంలోని మసీదులో కో ఆప్షన్‌ సభ్యుల జిల్లా ఫోరం అధ్యక్షుడు ఎండీరాజమహ్మద్‌ పండుగను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మసీద్‌ కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎండీ అజ్మత్‌మియా, హైదర్‌ పాషా, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మొగుళ్లపల్లి మండలంలో అబ్బు, రఫీ, మజార్‌, రాజాసాహెబ్‌, ఖలీల్‌, సర్వర్‌ ప్రార్థనలు చేశారు.

ముస్లింలకు ఎమ్మెల్యే గండ్ర శుభాకాంక్షలు

భూపాలపల్లి టౌన్‌ : భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్న ముస్లింలకు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి శనివారం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా అందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని కాంక్షించారు.  


logo