బుధవారం 21 అక్టోబర్ 2020
Jayashankar - Jul 30, 2020 , 04:56:34

మలేరియాతో మహిళ మృతి

మలేరియాతో మహిళ మృతి

వాజేడు : మలేరియాతో బుధవారం వాజేడు పీహెచ్‌సీలో మృతి చెందింది. వైద్యాధికారి వెంకటేశ్వర్లు, మృతురాలి బంధువుల కథనం ప్రకా రం.. తాడ్వాయి మండలం గోనెపల్లికి చెందిన మల్కం షర్మిళ(49) పీహెచ్‌సీలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇటీవల తన స్వగ్రామమైన కృష్ణాపురానికి కూతురుతో కలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో ఐదు రోజులుగా జ్వ రం రావడంతో వాజేడు పీహెచ్‌సీకి వచ్చింది. ఇద్దరికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు మలేరియా పాజిటివ్‌గా నిర్ధారించి చికిత్స అందిస్తుండగా షర్మిళ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహానికి కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ వచ్చిందని వైద్యాధికారి చెప్పారు. మృతదేహాన్ని బంధువులు గోనెపల్లికి తీసుకెళ్లారు. మృతురాలి కుతురు యువరాష్మికి వైద్యం అందిస్తున్నట్లు వైద్యాధికారి తెలిపారు. 


logo