శనివారం 31 అక్టోబర్ 2020
Jayashankar - Jul 28, 2020 , 02:34:26

‘అన్నారం’ నుంచి నీటి విడుదల

‘అన్నారం’ నుంచి నీటి విడుదల

కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నా రం(సరస్వతీ) బరాజ్‌ నుంచి సోమవారం నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. 6 గేట్లు ఎత్తి 3600 క్యూసెక్కుల నీటిని వదిలారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 10.87 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.47 టీఎంసీలు నీరు ఉన్నట్లు తెలిపారు. ఇన్‌ఫ్లో 2850 క్యూసెక్కులు ఉండగా, ఔట్‌ఫ్లో 3600 క్యూసెక్కులు ఉందన్నారు.