గురువారం 29 అక్టోబర్ 2020
Jayashankar - Jul 26, 2020 , 07:07:05

ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తే ఊరుకోం

ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తే ఊరుకోం

భూపాలపల్లి టౌన్‌, జూలై 25 : ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని టీఆర్‌ఎస్‌ నేతలు మండిపడ్డారు. శనివారం భూపాలపల్లిలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో గణపురం మండల నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇక్కడ పీఏసీఎస్‌ చైర్మన్‌ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, ఎంపీటీసీ మంద అశోక్‌ రెడ్డి, సీనియర్‌ నాయకులు పోలుసాని లక్ష్మీనరసింహారావు, ఐలోని రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ కొండంపల్లి ప్రాంతంలో ఓసీ-3 కోసం సింగరేణి స్వాధీనం చేసుకున్న భూమికి సంస్థ రూ.9 లక్షలు ఇస్తామని చెప్పగా ఎమ్మెల్యే గం డ్ర వెంకటరమణారెడ్డి సింగరేణి సీఎండీ, సీఎంతో మాట్లాడి రూ.15 లక్షలు ఇప్పించారని గుర్తుచేశారు.

ఓసీ-3 కింద ఇంకా సు మారు వెయ్యి ఎకరాలకు పైగా సింగరేణి స్వా ధీనం చేసుకోనున్నదని, గండ్ర సత్యనారాయణరావు ఆ భూమికి రూ.25 లక్షలు ఇ ప్పించి న్యాయం చేయాలని కోరారు. ఆయ న చరిత్ర ఎవరికీ తెలియంది కాదని, తండ్రి ఇచ్చిన మూడెకరాలతో ఇప్పుడు కోటీశ్వరుడు ఎలా అయ్యాడని ప్రశ్నించారు. తనతో ధర్నాకు దిగిన వారిలో రైతులు ఎందరు, అర్హులు, అనర్హులు ఎందరో ప్రజలు చూస్తూనే ఉన్నారని చెప్పారు. పరిహరం కోసం ఎవరి వద్దా నయా పైసా వసూలు చేయలేదని, వసూలు చేసినట్లు నిరూపించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా కొండంపల్లి రైతులపైన, ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డిపైన ఆరోపణలు చేస్తే ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు మోతె కరుణాకర్‌రెడ్డి, మలహాల్‌రావు, రైతులు కొండం రవీందర్‌రెడ్డి, బాల రాజేంద్రప్రసాద్‌రెడ్డి, చిత్తారి దేవేందర్‌, కోమల్ల నాగిరెడ్డి, సుంకరి సతీశ్‌రెడ్డి, ముత్యాల సురేశ్‌ పాల్గొన్నారు.


logo