శనివారం 31 అక్టోబర్ 2020
Jayashankar - Jul 25, 2020 , 06:23:50

మొక్కలు నాటి.. శుభాకాంక్షలు తెలిపి..

మొక్కలు నాటి.. శుభాకాంక్షలు తెలిపి..

  • ఘనంగా మంత్రి కేటీఆర్‌ బర్త్‌డే
  • జిల్లావ్యాప్తంగా పండుగలా నిర్వహించిన గులాబీ శ్రేణులు
  • భూపాలపల్లి, గణపురంలో పాల్గొన్నఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
  • పలుచోట్ల మాస్కులు, ఆశ్రమాల్లో పండ్లు పంపిణీ, అన్నదానం

మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జన్మదిన వేడుకలు శుక్రవారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపారు. పలుచోట్ల మాస్కులు, పండ్లు పంపిణీ చేయగా ఆశ్రమాలు, దవాఖానల్లో అన్నదానం చేశారు. అనాథాశ్రమానికి రూ.10వేలు విరాళమిచ్చిన ఎమ్మెల్యే గండ్ర  వెంకటరమణారెడ్డి.. కేటీఆర్‌ యువతకు మార్గదర్శకుడని పేర్కొన్నారు.

భూపాలపల్లి టౌన్‌ : తెలంగాణ పులిబిడ్డ కల్వకుంట్ల తా రక రామారావు అని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం భూపాలపల్లిలో నిర్వహించి న కేటీఆర్‌ జన్మదిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా భాస్కర్‌గడ్డ వద్ద పార్టీ నా యకులతో కలిసి మొక్కలు నాటారు. ఆ తర్వాత సుభాష్‌కాలనీలోని అమృతవర్షిణి అక్షర స్వచ్ఛంద సేవా సం స్థకు చెందిన అనాథాశ్రమంలో వృద్ధులు, పిల్లలకు అన్నదానం చేశారు. ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న కుసుమ శ్యాం ప్రసాద్‌-శైలజ దంపతులను అభినందించి ఆశ్రమానికి రూ.10 వేల ఆర్థిక సహాయం చేశారు. అనంతరం టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మందల రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మాస్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాస్కులు పంపిణీ చేశారు. ము న్సిపల్‌ పారిశుధ్య సిబ్బందికి, అనాథ మహిళలకు చీర లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమణారెడ్డి మాట్లాడుతూ  తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి దేశాన్ని తెలంగాణ రాష్ట్రం వైపు చూసేలా చేసిన కేసీఆర్‌ కడుపున పుట్టిన కేటీఆర్‌ చిన్న వయస్సులోనే ప్రపంచ దేశాల మెప్పు పొందారని కొని యాడారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాల తో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సెగ్గం వెంకటరాణి సిద్ధు, వైస్‌ చైర్మన్‌ కొత్త హరిబాబు, పీఏసీఎస్‌ చైర్మన్‌ మేకల సంపత్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ అర్బన్‌, మండల అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, మందల రవీందర్‌రెడ్డి, టీబీజీకేఎస్‌ బ్రాంచి ఉపాధ్యక్షులు కొక్కుల తిరుపతి, మాజీ ఎంపీపీ కళ్లెపు రఘుపతిరావు, నేతలు బుర్ర రమేశ్‌, తాటి అశోక్‌, జుమ్ములాల్‌, బీబీ చారి, మాడ హరీశ్‌రెడ్డి, ముం జాల రవి పాల్గొన్నారు.

యువతకు మార్గదర్శకుడు కేటీఆర్‌..

గణపురం : రాష్ట్ర ఆభివృద్ధిలో కీలక భూమి పోషిస్తున్న యువనేత, టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు యువతకు మార్గదర్శకుడని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం కర్కపల్లి గ్రా మంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పోట్ల నగేశ్‌, గణపురం పీఏసీఎస్‌ చైర్మన్‌ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్‌ బర్త్‌ డే ఘనంగా నిర్వహించా రు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మొక్క నాటారు. కేటీఆర్‌ రాష్ర్టాభివృద్ధే ప్రధాన ధ్యేయంగా నిరంతరం శ్రమిస్తున్నారన్నారని కొనియాడారు. కార్యక్రమం లో జిల్లా నాయకులు ఐలోని రాంచంద్రారెడ్డి, పొలుసా ని లక్ష్మీనర్సింరావు, ఎంపీటీసీ మారగాని సరస్వతి, టీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షుడు పోట్ల కిష్టయ్య, ఒద్దుల అశోక్‌రెడ్డి, ఏడెల్లి మల్లారెడ్డి, జన్ను ఓదేలు, ఏత్కూరి వెంకన్న పాల్గొన్నారు.

గణపురం మండలంలో..

కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా మండలకేంద్రంలో గ్రామ శాఖ అధ్యక్షుడు గుర్రం తిరుపతి ఆధ్వర్యంలో స ర్పంచ్‌ నారగాని దేవేందర్‌గౌడ్‌ కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పం పిణీ చేశారు. ఆ తర్వాత మొక్కలు నాటారు. చెల్పూర్‌లో సర్పంచ్‌ నడిపెల్లి మధుసూదన్‌రావు ఆధ్వర్యంలో మొక్కలు నాటి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆదే విధంగా గ్రామాల్లో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కేటీఆర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు పొనగంటి సుధర్మ, చెన్నూరి రమాదేవి, కొత్త వెంకన్న, కోల రవీందర్‌, డాక్టర్‌ జన్నయ్య, నర్సింహాచారి, నాగరాని మోహ న్‌, దిండు రమేశ్‌, ఆకుల శంకర్‌, రేపాక రాజేందర్‌, రెక్స్‌ రవి, తదితరులు ఉన్నారు.

రేగొండ: మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలు శుక్రవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ మండల ఆధ్యక్షుడు మోడెం ఉమేశ్‌గౌడ్‌ ఆధ్వర్యం లో పార్టీ కార్యాలయంలో శుక్రవారం వేడుకలు నిర్వహించారు. ఆ తర్వాత రోగులకు, ప్రజలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఉమేశ్‌గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ నడిపెల్లి విజ్ఞాన్‌రావు, ఎంపీపీ పున్నం లక్ష్మీరవి, నాయకులు సాయిని ముత్యంరావు, కోల్గురి రాజేశ్వర్‌రావు, కేసిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, మైస భిక్షపతి, గోపు భిక్షపతి, ఆశోక్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, గండి తిరుపతిగౌడ్‌ ఉన్నారు.

మహాముత్తారం: మండలంలోని పెగడపల్లి, జీలపల్లి గ్రామాల్లో మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్బంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు శుక్రవారం మొక్కలు నాటి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అ ధ్యక్షుడు మార్క రాముగౌడ్‌, పెగడపల్లి, జీలపల్లి సర్పంచ్‌లు కొర్ర వినోద జగపతి, కొడపర్తి మల్లిక సత్యనారాయణ, పెగడపల్లి ఎంపీటీసీ జాటోత్‌ వసంత రూపనాయక్‌, గ్రామ శాఖ అధ్యక్షుడు మధునయ్య, జాగృతి మండల అధ్యక్షుడు జాగరి రాజేశ్‌, యూత్‌ అధ్యక్షులు రాజేశ్‌ పాల్గొన్నారు.

మొగుళ్లపల్లి : మండలకేంద్రంలో శుక్రవారం కేటీఆర్‌ జ న్మదిన వేడుకలను టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఘనంగా ని ర్వహించారు. జెడ్పీటీసీ జోరుక సదయ్య కేక్‌ కట్‌ చేశా రు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బల్గూ రి తిరుపతిరావు, నాయకులు దండ వెంకటేశ్వర్‌రెడ్డి, ఏలే టి నర్సింహరెడ్డి, గుండారపు తిరుపతి ఉన్నారు.

కాటారం : రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన వేడుకలు టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్బంగా టీఆర్‌ఎస్‌ మ హిళా అధ్యక్షురాలు రత్న సౌజన్య, మండలాధ్యక్షుడు డోలి అర్జయ్య ఆధ్వర్యంలో పీహెచ్‌సీ ఆవరణలో మొక్క లు నాటారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశా రు. కార్యక్రమంలో నాయకులు నరివెద్ది శ్రీనివాస్‌, భూ పెల్లి రాజు, వంగల రాజేంద్రచారి, ఎలబాక సుజాత, లక్ష్మీచౌదరి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

చిట్యాల : మండలకేంద్రంలో మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలను టీఆర్‌ఎస్‌ నాయకులు ఘనంగా జరుపుకొన్నారు. శుక్రవారం టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కుంభం రవీందర్‌రెడ్డి చేతుల మీదుగా కేక్‌ కట్‌చేసి స్వీట్లు పంచి పెట్టారు. మండలకేంద్రంలో కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా నాయకులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ గొర్రె సాగర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కుంభం రవీందర్‌రెడ్డి, టౌన్‌ అధ్యక్షుడు స్వామి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు జంబుల తిరుపతి, నాయకులు  దావు వీరారెడ్డి ,చింతల రమేష్‌, చింతల సుమ న్‌,  పెరుమాండ్ల రవీందర్‌గౌడ్‌, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.

టేకుమట్ల : టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలను పార్టీ మండల అధ్యక్షుడు కత్తి సంపత్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో  మండల కేంద్రం పాటు వెలిశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్‌ కట్‌ చేసి మొక్కలను నాటి, రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, ఎంపీపీ మల్లారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి తిరుపతి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు మహేందర్‌గౌడ్‌,  సర్పంచ్‌ పోలాల సరోత్తంరెడ్డి, విజయస్వామిరావు,  శ్రీనివాస్‌, ఎంపీటీసీలు ఆది సునీతరఘు, గంధం వజ్రసారయ్య, రవి, నాయకుకలు సం పత్‌, ప్రవీణ్‌, సంతోష్‌, రాజు, రాంచందర్‌, శంకర్‌, స్వామి, తదితరులు పాల్గోన్నారు.

మల్హర్‌ : మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా తాడిచర్లలో మల్హర్‌ మండల యూత్‌ ఆధ్యక్షుడు జాగిరి హరీష్‌ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సింగిల్‌విండో వైస్‌ చైర్మన్‌ మల్క సూర్యప్రకాశ్‌, నాయకులు బూడిద మల్లేశ్‌, ఇనుముల సతీశ్‌, లక్ష్మణ్‌రావు, మంథని సమ్మయ్య, పూలిగంటి రాములు, బూ డిద సదానందం, గుమ్మడి రవి, మేడగాని సాంబయ్య, బోంతల రమేశ్‌ పాల్గొన్నారు.

మహదేవపూర్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు రాష్ట్ర టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటారు.మండలకేంద్రంలోని పీఏసీఎస్‌ కార్యాలయ ఆవరణలో ఛైర్మన్‌ సల్ల తిరుపతయ్య, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్‌ శ్రీపతిబాపులు మొక్కలు నాటారు.