మంగళవారం 27 అక్టోబర్ 2020
Jayashankar - Jul 25, 2020 , 06:20:45

కో ఆప్షన్‌కు 17 దరఖాస్తులు

కో ఆప్షన్‌కు 17 దరఖాస్తులు

భూపాలపల్లి టౌన్‌ : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో కో ఆప్షన్‌ పదవులకు శుక్రవారం సాయంత్రం వరకు 17 దరఖాస్తులు వచ్చినట్లు కమిషనర్‌ సమ్మయ్య తెలిపారు. మున్సిపల్‌ పాలనలో ప్రత్యేక అనుభవం కలిగిన వారికి కేటాయించిన రెండు స్థానాలకు గాను పురుషుల నుండి 4, మహిళల నుండి 5, అలాగే మైనార్టీ నుంచి కేటాయించిన రెండు స్థానాలకు పురుషుల నుండి 3, మహిళల నుండి 5 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. జనరల్‌ స్థానాలకు బేతోజు వజ్రమణి, తాటి హైమావతి, పెద్దిరెడ్డి దేవేంద్ర, పప్పుల రజిత, బోడ పద్మ, పిల్లి వేణు, దొంగల ఐలయ్య, వేముల మల్లేశ్‌గౌడ్‌, గురిజాల శ్రీనివాస్‌ దరఖాస్తు చేసుకున్నారని, అలాగే రిజర్వ్‌డ్‌ స్థానాలకు నెరవట్ల కమల, దాసరి నిర్మల, నెరపాటి రజిత, మహ్మద్‌ హసీనా బేగం, ఫౌజి యా, గడికొప్పుల ఇసాక్‌, కరీం మహ్మద్‌, మహ్మద్‌ ఇర్ఫాన్‌ దరఖాస్తు చేసుకున్నట్లు కమిషనర్‌ వెల్లడించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మూడు రోజుల్లో పరిశీలించి తుది జాబితా విడుదల చేస్తామని, ఎన్నిక తేదీ తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.


logo