గురువారం 22 అక్టోబర్ 2020
Jayashankar - Jul 25, 2020 , 06:19:55

సబ్సిడీపై పంట కల్లాలు

సబ్సిడీపై పంట కల్లాలు

ఏటూరునాగారం : రైతులు తమ పంట పొలాల్లో సొంత కల్లాలు నిర్మించుకునేందుకు ఉపాధి హామీ పథకం కింద దరఖాస్తు సమర్పించాలని ఏఓ వేణుగోపాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 538 చదరపు మీటర్ల యూనిట్‌కు రూ. 56వేలు, 60 చదరపు మీటర్ల యూనిట్‌కు రూ.68వేలు, 75 చదరపు మీటర్ల యూనిట్‌కు రూ. 85వేలు అయ్యే ఖర్చును ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం, బీసీ, ఓసీ రైతులకు 80శాతం సబ్సిడీపై ప్రభుత్వం అందచేస్తుందని తెలిపారు. పాస్‌ పుస్తకం, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా, ఉపాధి హామీ కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులను ఎంపీడీవో, ఏఈవోకు అందజేయాలని ఆయన కోరారు.


logo