శుక్రవారం 23 అక్టోబర్ 2020
Jayashankar - Jul 25, 2020 , 06:18:30

అవయవ దానాలకు అంగీకారం

అవయవ దానాలకు అంగీకారం

కాజీపేట: మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని 34వ డివిజన్‌ కార్పొరేటర్‌ జోరిక రమేశ్‌తోపాటు మరో 25 మంది పార్టీ శ్రేణులు జీవన్‌ దాన్‌ సంస్థ ఆధ్వర్యంలో నిమ్స్‌ దవాఖానకు అవయ వదాన అంగీకార పత్రాలను అందజేశారు.  ఈ మేరకు కాజీపేట పట్ట ణం బాలాజీనగర్‌లోని 34 వ డివిజన్‌ పార్టీ కార్యాలయంలో శుక్రవా రం పత్రాలను అందించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ మాట్లాడు తూ సమాజంలో పది మందికి ఉపయోగపడాలనే సంకల్పంతో అవ యవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. దీనికి ముందుకు వచ్చిన డివిజన్‌ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షుడు దువ్వ కనుకరాజు, నాయకులు కొండ్ర శంకర్‌, ఒగ్గుల భద్రయ్య, తండమల్ల వేణు, ఇంద విజయ్‌, మంద శ్రీనివాస్‌, వెంకటస్వామి,  వరప్రసాద్‌, ప్రవీణ్‌, సాయి, మ హేందర్‌, తదితరులు పాల్గొన్నారు.logo