మంగళవారం 27 అక్టోబర్ 2020
Jayashankar - Jul 02, 2020 , 02:02:25

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : గండ్ర

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : గండ్ర

    మొగుళ్లపల్లి : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని భూపాలపల్లి ఎమ్మె ల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మం డలంలోని మేదరమెట్ల, ములుకలపల్లి, వేములపల్లి గ్రామాల్లో అదనంగా మంజూరైన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పలుచోట్ల మొక్క లు నాటారు. అలాగే మొగుళ్లపల్లి సొసైటీలో ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భం గా ఏర్పా టు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సొసైటీల ద్వారా నాణ్యమైన ఎరువులను అందిస్తున్నదన్నారు. సొసైటీల బలోపేతానికి పాలకమండలి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ జోరుక సదయ్య, ఎంపీపీ యార సుజాత సంజీవరెడ్డి,సొసైటీ చైర్మన్‌ సంపెల్లి నర్సింగరావు, వైస్‌ ఎంపీపీ పోల్నేని రాజేశ్వర్‌రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి, కొనుకటి అరవింద్‌, మోటే ధర్మారావు, బెల్లంకొండ మాధవీశ్యాంసుందర్‌రెడ్డి, మంద సునీల్‌రెడ్డి, దానవేన రాములు, నరహరి వెంకట్‌రెడ్డి, ఎర్రబెల్లి పున్నం చందర్‌రావు, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు. 

           logo