ఆదివారం 05 జూలై 2020
Jayashankar - Jul 01, 2020 , 02:07:14

వరంగల్‌లో పనిచేయడం మరపురాని జ్ఞాపకం

వరంగల్‌లో పనిచేయడం మరపురాని జ్ఞాపకం

అందరి సమన్వయంతో విధుల్లో రాణించా

సిబ్బంది సహకారం మరువలేనిది

ఉద్యోగ విరమణ సభలో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ విశ్వనాథ రవీందర్‌ 

వరంగల్‌ క్రైం, జూన్‌30: వరంగల్‌లో పనిచేయడం మరచిపోలేని జ్ఞాపకమని పోలీసు కమిషనర్‌ రవీంద ర్‌ అన్నారు. 30 ఏళ్లుగా పొలీస్‌శాఖలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించిన సీపీ డాక్టర్‌ విశ్వ నాథ రవీందర్‌, అడిషనల్‌ డీసీపీ మల్లారెడ్డి మంగళవారం ఉద్యోగ విరమణ చేశారు. వరంగల్‌ పొలీస్‌ కమిష నరేట్‌ అధికారుల ఆధ్వర్యంలో భీమారంలోని శ్రీశుభం కల్యాణ మండపంలో సీపీ, మల్లారెడ్డిని సన్మా నించారు. కార్యక్రమానికి  ముఖ్య అతిథులుగా వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లా కలెక్టర్లు రాజీవ్‌ గాంధీ హన్మంతు, హరిత, ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌ అక్బర్‌, జైళ్ల శాఖ డీఐజీ రాజేశ్‌కుమార్‌ హాజరై పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది సహకారం మరువలేనిదని, సమన్వయంతో జఠిలమైన సమస్యలను పరిష్కరించామన్నారు. చిన్నారి శ్రీహిత హత్యకేసులో నింది తుడికి 50 రోజుల్లోనే మరణశిక్ష పడేలా చేయడం ఉద్యోగ ప్రస్థానంలో మరుపురాని విషయమన్నారు. అదేవిధంగా 9 హత్యల కేసును ఛేదించడం సంతృప్తినిచ్చిందన్నారు. వరంగల్‌ సీపీగా రాణించేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలు సహకరించాయన్నారు. నిజాయితీగా పనిచేసే అధికారులకు గుర్తింపు లభిస్తుం దనడానికి నా జీవితం ఉదాహరణగా చెప్పుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు పాల్గొన్నారు.

పోలీసుల గౌరవ వందనం..

సీపీ ఉద్యోగ విరమణను పురస్కరించుకొని ఏఆర్‌ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం పరేడ్‌ గ్రౌండ్‌లో వీడ్కోలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయుధ పోలీసుల నుంచి డాక్టర్‌ రవీందర్‌ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సీపీ రవీందర్‌ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న ఆర్ముడ్‌ రిజర్వ్‌ కానిస్టేబుళ్లకు ఉద్యోగోన్నతులు కల్పించడం అత్యంత సంతృప్తినిచ్చిందని అన్నారు. అనంతరం సీపీని సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో వెస్ట్‌జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, అదనపు డీసీపీలు భీంరావు, వెంక టలక్ష్మి, ఏసీపీలు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.. 


logo