శనివారం 31 అక్టోబర్ 2020
Jayashankar - Jul 01, 2020 , 01:22:43

స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులు

స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులు

మంత్రులు కేటీఆర్‌, ఎర్రబెల్లికి కృతజ్ఞతలు తెలిసిన ఎమ్మెల్సీ పోచంపల్లి

సుబేదారి, జూన్‌ 30: సీఎం కేసీఆర్‌ సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు మూడంచెల పద్ధతిన 15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీరాజ్‌ శాఖ వాటా కింద మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో ఎర్రబెల్లిని శ్రీనివాస్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందించి ధన్యవాదాలు తెలిపారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం పంచాయతీరాజ్‌ శాఖ నుంచి జీపీలకు 85 శాతం, మండల పరిషత్‌లకు 15 శాతం, జిల్లా పరిషత్‌లకు 5 శాతం వాటాగా పంపిణీ చేసిందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్రగతి, పట్టణ ప్రగతి పథకాలతో నిధులు కేటాయిస్తున్నదని, కేంద్రం నుంచి వచ్చే నిధులు గ్రామాల అభివృద్ధికి మరింత చేయుతనిస్తాయన్నారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ సూచన మేరకు కేంద్రం స్థానిక సంస్థలకు నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. మంత్రిని కలిసిన వారిలో హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఉన్నారు.