సోమవారం 06 జూలై 2020
Jayashankar - Jun 29, 2020 , 01:43:02

పాలిటెక్నిక్‌ పరీక్షలను రద్దుచేయాలి

పాలిటెక్నిక్‌ పరీక్షలను రద్దుచేయాలి

  • మంత్రి హరీశ్‌రావుకు టీఎస్‌ఎఫ్‌ వ్యవస్థాపకుడు 
  • అక్షయ్‌కుమార్‌ వినతి

మట్టెవాడ, జూన్‌ 28: పాలిటెక్నిక్‌ సెమిస్టర్‌ పరీక్షలను రద్దు చేయాలని, పాలీసెట్‌, ఈసెట్‌ను వాయిదా వేయాలని టెక్నికల్‌ స్టూడెం ట్‌ ఫెడరేషన్‌ (టీఎస్‌ఎఫ్‌) వ్యవస్థాపకుడు మేకల అక్షయ్‌కుమార్‌ కోరారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్‌రావును సిద్దిపేటలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 3 నుంచి పాలిటెక్నిక్‌ విద్యార్థులకు సెమిస్టర్‌ పరీక్షలను నిర్వహించడానికి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను చేసిందని తెలిపారు.

కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు కరోనా బారిన పడే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో సెమిస్టర్‌ పరీక్షలను పూర్తిగా రద్దు చేయాలని ఆయన కోరారు. అంతేకాకుండా జూలై 1న పాలీసెట్‌, జూలై 4న నిర్వహించనున్న ఈ సెట్‌ను వాయిదా వేయాలని కోరారు. మంత్రికి వినతి పత్రం ఇచ్చిన వారిలో టీఎస్‌ఎఫ్‌ నాయకులు సంబోజి సాయి రోహిత్‌, బస్వరాజు నాగరాజు, సింగోజు సాయితేజ తదితరులు ఉన్నారు. 


logo