శనివారం 24 అక్టోబర్ 2020
Jayashankar - Jun 29, 2020 , 01:39:05

విద్యార్థులు ఆన్‌లైన్‌ సర్వేలో పాల్గొనాలి

విద్యార్థులు ఆన్‌లైన్‌ సర్వేలో పాల్గొనాలి

  • జయశంకర్‌ భూపాలపల్లి డీఈవో నారాయణరెడ్డి

అంబేద్కర్‌సెంటర్‌ : మహిళలు, పిల్లల భద్రత కోసం తెలంగాణ మహిళా పోలీస్‌ భద్రతా విభాగం చేపట్టనున్న ఆన్‌లైన్‌ సర్వే లో జిల్లాలోని 8 నుంచి 10వ తరగతి విద్యార్థులు పాల్గొనాలని డీఈవో నారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. కొవిడ్‌-19 తీవ్రరూపం దాల్చిన ఈ సమయంలో ‘టీన్స్‌ ఆన్‌లైన్‌ సర్వే’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభు త్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు సర్వేలో పాల్గొనేలా  తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని ఆయన కోరారు. సర్వేలో పాల్గొనే వారు ‘ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ టీఎస్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌' వెబ్‌సైట్‌ నుంచి వివరాలు పొందొచ్చన్నారు. http: ||bit.ly| tspolice-youngster-conscios లింక్‌ నుంచి నేరుగా ఆన్‌లైన్‌ సర్వేలో పాల్గొనొచ్చన్నారు.logo