బుధవారం 21 అక్టోబర్ 2020
Jayashankar - Jun 16, 2020 , 01:07:31

కాళేశ్వరంలో భక్తుల సందడి..

కాళేశ్వరంలో భక్తుల సందడి..

ఎగువన వర్షాలతో పెరుగుతున్న గోదావరి ఉధృతి

కాళేశ్వరం: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి పెరుగుతున్నది. మహారాష్ట్రలోని ప్రాణహిత నది నుంచి గోదావరికి సోమవారం 25 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో పెరిగింది. రెండు రోజుల క్రితం ప్రాణహిత నది నుంచి సుమారు 500 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉండగా, సోమవారం ఒక్కసారిగా 25 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోకు పెరిగింది. దీంతో కాళేశ్వరం వద్ద క్రమంగా గోదావరి ఉధృతి పెరుగుతున్నది. కాగా, గోదావరి నదిలో స్నానాలు ఆచరించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ అధికారులు వారికి పలు సూచనలు చేశారు.


logo