ఆదివారం 25 అక్టోబర్ 2020
Jayashankar - Jun 15, 2020 , 02:02:00

భారంగా.. బతుకు బండీ

భారంగా.. బతుకు బండీ

తనకు జీవనాధారమైన తోపుడు బండి.. టైర్లు పలిగిపోయి, రీములు వంగిపోయి, చెక్కలు విరిగిపోయి ముందుకు కదలలేక మొరాయిస్తున్నది. తానే ఆధారమైన తన కుటుంబాన్ని ఈ బండితోనే నెట్టుకొస్తూ.. తన పిల్లలను సైతం జోలె కట్టి అందులోనే మోసుకొస్తూ ఈ బడుగుజీవి భారంగా ముందుకు సాగడం ‘నమస్తే’కంట పడింది. వీధుల్లో చిత్తు కాగితాలు, అట్టలు, ఖాళీ సీసాలు ఏరుకుంటూ, కాలనీల్లో ప్రజలనుంచి సేకరించి అమ్మగా వచ్చిన పదో పరకతోనే కలోగంజో తాగి వీరు కాలం వెళ్లదీస్తుంటారు. భూపాలపల్లి పట్టణంలోని బస్టాండ్‌ సమీపంలో ఓ వ్యక్తి ఆదివారం తన ఇద్దరు పిల్లలను తోపుడు బండికి కట్టిన జోలెలో పడుకోబెట్టుకొని, ఖాళీ సీసాలు సేకరించుకొని తిరుగుపయనమవుతూ కనిపించాడు.

-జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఫొటోగ్రాఫర్‌


logo