సోమవారం 26 అక్టోబర్ 2020
Jayashankar - Jun 14, 2020 , 00:54:57

సేఫ్‌ మాస్కు..

సేఫ్‌ మాస్కు..

వరంగల్‌ : కరోనా వైరస్‌ను తేలిగ్గా తీసుకుంటే ఎంతటి ప్రమాదమో దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న కేసులే నిదర్శనం. ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేసినా, ఎన్ని నిబంధనలు అమలు చేస్తున్నా కొందరు పెడచెవిన పెడుతున్నారు. కొవిడ్‌-19కు పేద, ధనిక భేదం లేదు. నిర్లక్ష్యం చేస్తే కాటేయడం ఖాయం. ముఖ్యంగా నిత్యం ప్రజల మధ్య ఉంటే ప్రజాప్రతినిధులు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో శనివారం మంత్రి ఎర్రబెల్లి పర్యటనలో పాల్గొన్న వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ చేతులకు గ్లౌజులతోపాటు ఎన్‌95 మాస్కు, ఫేస్‌ మాస్కు ధరించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరి జాగ్రత్తలో వారు ఉండడం మంచిదని ఎమ్మెల్యే సూచించారు.


logo