శనివారం 24 అక్టోబర్ 2020
Jayashankar - Jun 10, 2020 , 04:14:51

సభ్యత్వం లేని వారు దరఖాస్తు చేసుకోండి

సభ్యత్వం లేని వారు దరఖాస్తు చేసుకోండి

మంగపేట: మంగపేట ప్రాథమిక వ్యవసాయ రైతు సేవా సహకార సంఘంలో సభ్యత్వం లేని రైతులు కొత్తగా సభ్యత్వం పొందే అవకాశం కల్పిస్తున్నట్లు చైర్మన్‌ తోట రమేశ్‌ తెలిపారు. ఈమేరకు ఆయన సహకార కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన సభ్యత్వం కోసం రైతులు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ ప్రతులతో పాటు రూ.550 సభ్యత్వ రుసుము చెల్లించాలని కోరారు. సమావేశంలో సీఈవో అచ్చ నరేశ్‌, ఆయా గ్రామాల సహకార డైరెక్టర్లు, క్లర్క్‌ జగన్నాథరావు, సిబ్బంది పాల్గొన్నారు.


logo