బుధవారం 21 అక్టోబర్ 2020
Jayashankar - Jun 10, 2020 , 04:11:57

పథకాలు సమర్థవంతంగా అమలు చేయండి

పథకాలు సమర్థవంతంగా అమలు చేయండి

  • ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రావొద్దు  n ఏదైనా సమస్య వస్తే నాకు చెప్పండి
  • జిల్లా కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ 
  • అధికారులతో సమీక్ష

భూపాలపల్లి కలెక్టరేట్‌ : ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలుచేయాలని జిల్లా కలెక్టర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ అజీమ్‌ అధికారులను ఆదేశించారు. ఈమేరకు మంగళవారం కలెక్టరేట్‌లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం, పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బీ శాఖల ద్వారా చేపట్టిన వివిధ నిర్మాణ పనుల ప్రగతి, మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధిపై సమీక్షించారు. అలాగే చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం, అంగన్వాడీ భవనాల నిర్మాణం, వ్యవసాయ శాఖ ద్వారా రైతుబంధు, రైతు బీమా, వానకాలం పంటల ప్రణాళిక, పౌర సరఫరాల శాఖ ద్వారా వరి ధాన్యం కొనుగోలు, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా కరోనా నియంత్రణ చర్యలు, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా గ్రామాల్లో  శ్మశానవాటికలు, చెత్త డంపింగ్‌ యార్డ్‌ల నిర్మాణం, ఈజీఎస్‌ గోడౌన్‌ల నిర్మాణం, ఆసరా పింఛన్లు, సదరమ్‌ క్యాంపుల నిర్వహణ, నర్సరీల ఏర్పాటు, పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధికి చేపట్టిన పనులు, జాతీయ ఉత్తమ ప్రణాళిక గ్రామంగా ఎన్నికైన గంగారం గ్రామ అభివృద్ధి, విద్యుత్‌ శాఖ సేవలు, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ వెనుక బడిన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రా ధాన్యమిస్తున్నదన్నారు. ప్రజాప్రతినిధుల సహకారంతో జిల్లాలో చేప ట్టిన అభివృద్ధి, సంక్షేమ పనులన్నీ ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాల న్నారు. సకాలంలో వాటిని పూర్తిచేసి వారికి లబ్ధి చేకూరేలా అధికారులు నిబద్ధతతో పనిచేయాలన్నారు. విధి నిర్వహణలో ఏదైనా సమస్య వస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాజా విక్రమ్‌రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సుమతి, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, జిల్లా వ్యవసాయ అధికారి నగేశ్‌, జిల్లా సంక్షేమాధికారి శ్రీదేవి, జిల్లా పౌర సరఫరాల అధికారి గౌరిశంకర్‌, పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌ రాఘవేందర్‌, పంచాయతీరాజ్‌ ఈఈ రాంబాబు, ఆర్‌ అండ్‌ బీ ఈఈ వెంకటేశ్‌ పాల్గొన్నారు.

పంటల సాగుపై అవగాహన కల్పించండి

వరికి బదులు చిరు ధాన్యాల సాగుపై రైతుల్లో చైతన్యం తీసుకురావాలని జిల్లా కలెక్టర్‌ అన్నారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లాస్థాయి జాతీయ ఆహారభద్రత అమలు కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహారం లభించేలా వ్యవసాయ శాఖ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, ఆహార పంటల సాగుపై రైతు లకు అవగాహన కల్పించాలని అన్నారు. అధిక దిగుబడులు సాధించే కొత్త రకం వంగడాలను రైతులకు పరిచయం చేయాలని, రసా యనిక ఎరువులకు బదులు సేంద్రియ ఎరువులను ప్రోత్సహించాలన్నారు. అలాగే సబ్సిడీపై విత్తనాలు అందించాలని, భూసార సంరక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని, వరికి బదులు చిరు ధాన్యాలు సాగు చేసేలా చైతన్యం తేవాలని కలెక్టర్‌ అన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారులు, ఎల్డీఎం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


logo