ఆదివారం 25 అక్టోబర్ 2020
Jayashankar - Jun 07, 2020 , 02:43:47

పేదలకు అందుబాటులో ప్రభుత్వ వైద్యం : కడియం

పేదలకు అందుబాటులో ప్రభుత్వ వైద్యం : కడియం

స్టేషన్‌ఘన్‌పూర్‌/ వేలేరు, జూన్‌ 6: ప్రభుత్వ దవాఖానల్లోనే పేదలకు మెరుగైన వైద్యం అందు తుందని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. శనివారం హన్మకొండలోని తన నివా సంలో 28 మందికి సీఎం ఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం జేఏసీ సభ్యుల సమక్షంలో ఎన్‌హెచ్‌, ఆర్‌అండ్‌బీ అధికారులతో సమీక్షించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ గాంధీ చౌరస్తా వద్ద బ్రిడ్జిని పిల్లర్లతో నిర్మించాలన్నారు.  గ్రావిటీ ఆధారంగానీరు పోయేలా డ్రైనేజీ నిర్మించాలన్నారు. పాలకుర్తి రహదారి వైపు 33ఫీట్ల రోడ్డుకు మూడు ఫీట్ల డ్రైనేజీకి స్లాబ్‌ వేయాలన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ ఎడవెల్లి కృష్ణారెడ్డి, రైస్‌ మిల్లర్స్‌ అసోసి యేషన్‌ జిల్లా అధ్యక్షుడు బెలిదె వెంకన్న, కడియం ఫౌండేషన్‌  ప్రతినిధి రాజేశ్‌ నాయక్‌, మాజీ జెడ్పీటీసీ స్వామినాయక్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు బూర్ల శంకర్‌, నీల గట్ట య్య, చిలుపూరు కడియం యువసేన మండల అధ్యక్షుడు జక్కుల రాజయ్య, సర్పంచ్‌లు, ఎంపీ టీసీలు, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.


logo