బుధవారం 21 అక్టోబర్ 2020
Jayashankar - Jun 07, 2020 , 02:42:13

కరోనా నివారణకు కృషి చేయాలి : అరూరి

కరోనా నివారణకు కృషి చేయాలి : అరూరి

వర్ధన్నపేట/ నయీంనగర్‌, జూన్‌ 6 : వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యం లో ప్రజలు సీజనల్‌ వ్యాధులు, కరోనా బారిన పడకుండా జిల్లా వైద్య అధికారులు కృషి చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ కోరారు. హన్మ కొం డ ప్రశాంతినగర్‌లోని ఆయన స్వగృహంలో శనివారం ఉదయం ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ వైద్యులతో సీజనల్‌ వ్యాధులు, కరోనా నివారణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పట్టణ, పల్లె ప్రజలకు నివారణ చర్యలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమైనా అందించేందుకు సీఎం కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ కొత్తగట్టు శ్రీనివాస్‌, ప్రతినిధులు డాక్టర్‌ సుదీప్‌, డాక్టర్‌ శేషుమాదవ్‌, డాక్టర్‌ ప్రవీణ్‌, డాక్టర్‌ కృపదానం, డాక్టర్‌ సాయిని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

రైతులకు అందుబాటులో ఎరువులు : రెడ్యా

నర్సింహులపేట, జూన్‌ 6 : వానకాలంలో పంటలు సాగు చేస్తున్న రైతుల కు ఇబ్బందులు కలుగకుండా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయ ని ఎమ్మెల్యే ధరంసోత్‌ రెడ్యానాయక్‌ అన్నారు. శనివారం. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ టేకుల సుశీల అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. చరిత్రలో ఎన్నడూ లేనంతగా యాసంగిలో ధాన్యం పండిందన్నారు. రైతులు తాము పండించే పంటలకు గిట్టుబాటు ధర రావాలంటే ప్రభుత్వం చెప్పిన పంటలు సాగు చేయాలన్నారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు పరిసరాల శుభ్రత పాటించాలన్నారు. సర్పంచ్‌లు, కార్యదర్శులు గ్రామాల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రా వణాన్ని పిచికారీ చేయించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ భూక్య సంగీత, వైస్‌ ఎంపీపీ జాటోత్‌ దేవేందర్‌, తహసీల్దార్‌ పున్నంచందర్‌, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ సంజీవరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.logo